English   

వ్యాపారవేత్తతో ప్రముఖ యాంకర్ ఎఫైర్...పెళ్లి కూడా

anchor
2020-01-26 07:07:22

తెలుగులో యాంకర్ అంటే టక్కున గుర్తు వచ్చే పేర్లు కొన్ని ఉన్నాయి. అందులో కొందరు ఎప్పటినుండో యాంకరింగ్ చేస్తూనే అలరిస్తుండగా మరికొందరు కొన్ని వ్యక్తిగత కారణాల వలన ఆ రంగానికి దూరమయి మళ్ళీ వచ్చి ఇప్పుడు ఆ రంగంలో మళ్ళీ బిజీ అవ్వాలని చూస్తోంది.  కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో పాపులర్ యాంకర్ గా వెలుగొందిన ఆమె చాల ఛానెల్స్ లో షోలు చేస్తూ బిజీగా ఉండేది. ఆ తరువాత తన కో యాంకర్ ని పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచిందామె. వీరిద్దరికీ ఓ కూతురు కూడా పుట్టి ఆమె కాస్త పెద్దయ్యాక ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తడంతో విడాకులు తీసుకొని ఒకరికొకరు దూరమయ్యారు. అప్పటి నుండి ఈ యాంకర్ కం నటి తన కూతురుతో కలిసి జీవిస్తోంది. ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం ఈమెకి అవకాశాలు బాగా తగ్గాయి. ఈ మధ్య తనకంటూ కొంత వర్గాన్ని రెడీ చేసుకుంది. ఈవెంట్స్ కూడా బానే చేస్త్గొంది. అయితే ప్రస్తుతం ఈమెకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. పెళ్లి తరువాత చాలా కాలంగా ఒంటరిగా ఉంటోన్న ఈమె ప్రస్తుతం ఓ బిజినెస్ మెన్ తో లివింగ్ రిలేషన్ లో ఉందట. గోవాలో వ్యాపారవేత్తగా పేరు గాంచిన సదరు వ్యక్తి ఈ సీనియర్ యాంకర్ ని పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటున్నారట. త్వరలోనే ఆమె ఈ విషయం అధికారికంగా ప్రకటించవచ్చని అంటున్నారు. అయితే ఆమె కూతురి విషయంలోనే కొంచెం వెనక్కి తగ్గుతున్నట్టు చెబుతున్నారు. ఇక ఆ బిజినెస్ మ్యాన్ కి ఇండస్ట్రీలో చాలా మందితో పరిచయాలు ఉన్నాయట. అందుకే ఆమె పెళ్లి విషయంలో కూడా వెనక్కి తగ్గుతున్నట్టు చెబుతున్నారు.

More Related Stories