English   

బూతు చూపించి బూతు లేదంటే ఎట్టా...

Sona Malayalam Movie.jpg
2020-01-26 11:12:22

బూతు సినిమాకి ఎప్పుడూ ఆడియెన్స్ ఉండనే ఉంటారు. కానీ ఈ మధ్య అది హద్దులు దాటి అన్ని సినిమాల్లోకీ చొచ్చుకు వస్తోంది. అయితే ఇప్పటిదాకా శృంగార సినిమాలు శృంగార పాత్రలు మాత్రమే చేస్తూ వచ్చిన ఒక నటి నుండి సినిమా వస్తుంది అంటే జనం ఏమైనా భక్తి రస చిత్రం ఎక్స్పెక్ట్ చేస్తారా ? అదేమీ లేదు కదా. కానీ తన గురించి తప్పుగా ప్రచారం చేయకండి ప్లీజ్‌ అని అంటోంది సదరు నటి. ఆమె పేరు సోనా. ఒక మలయాళ సినిమా కోసం శృంగారాత్మక పాత్రలో విచ్చలవిడిగా అందాలను గుమ్మరించడమే కాక ఆ పాత్ర చాలా మంచిది వేరే ద్రుష్టితో చూడకండి అంటోంది ఈ భామ.

ఆమె అందాలారబోసిన ఆ సినిమా పేరు పచ్చమాంగ. మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ ఇటీవల విడుదలైంది. అందులో నటి సోనా శృంగార రస నటన గురించి మళయాళ ప్రేక్షకులు రకరకాలా కామెంట్లు చేస్తున్నారు.  ఆ ట్రైలర్ చూసిన ఆ మలయాళ బ్రదర్స్ మాకు మరో షకీలా దొరికింది అంటూ కామెంట్స్ చేస్తున్నారట. ఇన్నాళ్లకు షకీలాకు వారసురాలు లభించింది ఇండస్ట్రీకి అంటూ మలయాళ ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే తనను కొత్త షకీలా అంటూ కామెంట్స్ చేస్తున్న వారిని మీద ఆమె మండిపడుతోంది. పచ్చమాంగా ఒక బలమైన కథాంశంతో కూడిందని బాలుమహేంద్ర సినిమాల లాగా పక్కా క్లాస్ సినిమా అని ట్రైలర్‌లో తన తాను ధరించిన దుస్తులు, కొద్ది పాటి సన్నివేశాలను చూసి శృంగార భరిత పాత్రలో నటించినట్లు భ్రమను కలిగిస్తున్నారని అంది. అది నిజం కాదని చెప్పింది.

కేరళలో మహిళలు ఎలా దుస్తులు ధరిస్తారో అలానే సహజంగా ఉండాలని అలాంటి దుస్తులు ధరించినట్లు ఆమె చెబుతోంది. తాను ధరించిన దుస్తులను బట్టి అది గ్లామరస్‌ కథా చిత్రం అనో, తనను శృంగార నటి అనో చిత్రీకరించరాదని అభ్యర్థిస్తున్నానని చెప్పింది.

More Related Stories