English   

డిజాస్టర్ ఇచ్చిన డైరెక్టర్ కి ఓకే చెప్పిన రవితేజ

Ravi Teja.jpg
2020-01-26 13:06:01

మాస్ మహారాజ రవితేజ డిస్కో రాజా సినిమాలో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.ఈ సినిమా సూపర్ హిట్ కాకున్నా పర్వాలేదనే టాక్ తో నడుస్తుంది. ఈ సినిమా తర్వాత తనకి రెండు హిట్స్ ఇచ్చిన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో గోపిచంద్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక ఆ సినిమా తర్వాత ర‌వితేజ మరో సినిమా ఏమిట‌న్న విష‌యంలో ఓ క్లారిటీ వ‌చ్చింది. తనకి భారీ డిజాస్టర్ ఇచ్చిన ర‌మేష్ వ‌ర్మకి ర‌వితేజ మ‌రోసారి ఛాన్స్ ఇచ్చేశాడు. గ‌తంలో వీరిద్దరి కాంబినేష‌న్‌లో ‘వీర’ వచ్చింది.

కమర్షియల్ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమా రవితేజ కెరియర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఆ దర్శకుడు ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ ఇచ్చి బెల్లంకొండ శ్రీనివాస్ తో రాక్షకుడు అనే రీమేక్ సినిమా చేసి హిట్ కొట్టాడు. అయితే మరి ఆ హిట్ బలమో లేక కధా బలమో కానీ మళ్ళీ మరో సారి ర‌మేష్ వ‌ర్మను నమ్మాడు ర‌వితేజ‌. ఈ సినిమాకి కోనేరు స‌త్యనారాయ‌ణ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తారు. ఫిబ్రవ‌రిలో మొదలు కానున్న ఈ సినిమా మార్చి నుంచి షూటింగ్ కి వెళ్తుంది. ఈలోగా హీరోయిన్ మిగిలిన న‌టీన‌టుల వివ‌రాలు ప్రక‌టిస్తారు. దాదాపు 8 ఏళ్ల తర్వాత రవితేజ, రమేష్‌ కాంబినేషన్‌ కలవనుందన్న మాట.

More Related Stories