English   

ఇప్పటిదాకా ఎవరూ టచ్ చేయని పాత్రలో బాలయ్య

Balakrishna.jpg
2020-01-26 14:41:24

ఎన్టీఆర్ బయోపిక్ సిరీస్, రూలర్ సినిమాలు పరాజయాల్ని మిగల్చడంతో నందమూరి నటసింహం బాలకృష్ణ తన తదుపరి సినిమాని తనకు బాగా అచ్చొచ్చిన బోయపాటితో కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. సింహ, లెజెండ్ లాంటి రెండు బంపర్ హిట్స్ రావాడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలో సెట్స్ మీదకు వెళ్ళనున్న ఈ సినిమా నందమూరి అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే గత రెండు సినిమాల్లో రెండ్రెండు పవర్ ఫుల్ రోల్స్ డిజైన్ చేసిన బోయపాటి ఈ సినిమాలో ఏ రేంజ్ లో పవర్ ఫుల్ రోల్ డిజైన్ చేశాడనే దాని మీద చర్చ జరుగుతోంది.

అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలకృష్ణ రెండు వైవిధ్యమైన పాత్రల్ని పోషిస్తోన్నట్టు తెలుస్తోంది. అందులో ఒక పాత్ర అఘోరా అట.  వార‌ణాసి నేప‌థ్యంలో ఈ పాత్రకి సంబంధించిన స‌న్నివేశాలు కూడా ఒక రేంజ్ లో ప్లాన్ చేశాడట బోయపాటి. బోయపాటి లొకేషన్స్ ఎంపిక కోసం వారణాశి కూడా వెళ్ళొచ్చాడు. అయితే తన తల్లి చనిపోవడంతో లోకేషన్స్ కి బ్రేక్ ఇచ్చారు. ఇప్పటిదాకా ‘నేను దేవుణ్ణి’ సినిమా కోసం తమిళ హీరో ఆర్య అఘోరాగా నటించాడు. ఆ తర్వాత అఘోరాగా కనిపించే హీరో బాలయ్యే అవడం విశేషం.

More Related Stories