English   

నీ నడుమును పట్టుకు వదలనన్నివి చూడే మా కళ్లు..

pooja
2020-01-26 19:09:24

ఇప్పుడు పూజాను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మరి. అల వైకుంఠపురములో సినిమాలో కాళ్లతో మాయ చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు మాత్రం నడుముతో చంపేస్తుంది. ఎక్కడ బడితే అక్కడ.. ఎప్పుడు బడితే అప్పుడు నడుమును చూపించి ప్రాణాలు తీస్తుంది పూజా. ఇప్పుడు కూడా ఇదే చేసింది. ఒక్క‌సారి అందాలు ఆర‌బోసిన త‌ర్వాత మ‌ళ్లీ మ‌ళ్లీ అదే చేసినా పెద్ద‌గా స‌మ‌స్య ఉండ‌దు. ఇప్పుడు ఇదే చేస్తుంది పూజాహెగ్డే. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ఎవ‌రు అంటే మ‌రో మాట లేకుండా పూజా పేరు చెబుతారు. ఎందుకంటే ఒక్క హిట్ కూడా లేకుండానే సూప‌ర్ స్టార్స్ అంద‌ర్నీ చుట్టేసింది ఈ భామ‌. అయినా కూడా ఈ హీరోయిన్ల‌తో ఇదేన‌బ్బా ప్రాబ్ల‌మ్.. వాళ్ల‌కు చేతినిండా సినిమాలు ఉన్నా కూడా ఇంకో హీరోయిన్ ను మాత్రం బ‌త‌క‌నివ్వ‌రు. పోటీ అనుకోండి.. ఇంకేదైనా అనుకోండి కానీ ఒక‌రితో ఒక‌రు కంటికి క‌న‌బ‌డని యుద్ధం చేస్తుంటారు. పూజాహెగ్డే ఇదే ప‌నిలో బిజీగా ఉంది. ఇప్పుడు ఈమె స్టార్ హీరోయిన్. ఇంకా మాట్లాడితే కాబోయే నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్. ఎందుకంటే ఈమె చేతిలో ఉన్న సినిమాలు అలాంటివి మ‌రి. గతేడాది కాలంగా తెలుగు ఇండస్ట్రీని రూల్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ప్రభాస్, అఖిల్ సినిమాలలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇన్ని సినిమాలు లైన్ లో ఉండ‌గానే ఇప్పుడు మ‌రోసారి హాట్ ఫోటోషూట్స్ తో నేనున్నానంటూ గుర్తు చేస్తుంది పూజా. అంటే మిగిలిన అవ‌కాశాలు కూడా నాకే ఇవ్వండి.. ఇంక ఇక్క‌డ మ‌రో హీరోయిన్ లేదు అని హింట్ ఇస్తుంది పూజా. డేట్స్ లేవు కానీ లేదంటే ఇంకా ఇద్ద‌రు హీరోలు కూడా పూజానే కావాలంటున్నారు. తెలుగులో ఇంత బిజీగా ఉన్నా కూడా బాలీవుడ్ పై కూడా ఓ క‌న్నేసే ఉంచుతుంది పూజాహెగ్డే. తెలుగులో మూడేళ్లు వేచి చూసిన త‌ర్వాతే ఇలాంటి గోల్డెన్ టైమ్ వ‌చ్చింది. ఎవ‌రేం అనుకున్నా పూజా టైమ్ స్టార్ట్స్ నౌ.. ఇక ఆమె ఆడిందే ఆట‌.. పాడిందే పాట‌..!

More Related Stories