English   

ప్రేమికుడితో రాశిఖన్నా తొలి అనుభవం అదిరిపోయిందట..

rasi
2020-01-27 07:01:57

టైటిల్ చూసి తప్పుగా భావించవద్దు. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో వరుస విజయాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్ కావడానికి ఒక్కో అడుగు వేస్తుంది రాశిఖన్నా. 10 రోజుల గ్యాప్ లోనే వెంకీ మామ, ప్రతి రోజు పండగే ఇలాంటి విజయాలు అందుకుంది రాశి. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది ఈమె. అందులో ఒకటి వరల్డ్ ఫేమస్ లవర్. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. క్రాంతి మాధవ్ ఈ చిత్రానికి దర్శకుడు. దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. క్రియేటివ్ కమర్షియల్స్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ సంచలనాలు సృష్టించింది. ఇందులో రాశిఖన్నా చాలా బోల్డ్ గా నటించింది. దానికి తోడు విజయ్ దేవరకొండతో అధర చుంబనాలు కూడా ఉన్నాయి. ఇక ఈ సినిమాలో తొలిసారి తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకుంది రాశిఖన్నా. ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా ఏ సినిమాకు కూడా సొంత డబ్బింగ్ చెప్పుకోలేదు రాశి. తొలిసారి వరల్డ్ ఫేమస్ లవర్ కోసం తన స్వరం వినిపిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటి వరకు డబ్బింగ్ చెప్పుకోలేదు కానీ పాటలు మాత్రం పడింది రాశి ఖన్నా. మొన్న వెంకీ మామలో కూడా ఒక పాట పాడింది ఈ భామ. మొత్తానికి ఇటు నటిగా.. అటు సింగర్ గా సత్తా చూపిస్తుంది ఈ బ్యూటీ. ఇక ఇప్పుడు డబ్బింగ్ కూడా చెప్పుకొని నిర్మాతకు కాస్త డబ్బులు మిగిలించింది. ఏదేమైనా కూడా డబ్బింగ్ చెప్పడం అద్భుతంగా ఉంది అంటుంది రాశి ఖన్నా.

More Related Stories