English   

హరీష్ శంకర్ నెక్స్ట్ సినిమా ఎవరితో తెలుసా..

harish
2020-01-27 07:11:28

కొందరు దర్శకులు హిట్ సినిమాలు వచ్చినా కూడా వేచి చూడక తప్పని పరిస్థితి. హరీష్ శంకర్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. డిజె సినిమా తర్వాత రెండేళ్లకు పైగా వేచి చూసి గద్దలకొండ గణేష్ సినిమా చేశాడు హరీష్ శంకర్. ఈ సినిమా బాగానే ఆడింది కానీ మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ సినిమా కోసం చాలా తంటాలు పడుతున్నాడు ఈ దర్శకుడు. ఈయన మెగా ఫ్యామిలీకి బాగా దగ్గరగా ఉన్నాడు. బయట హీరోలకు తెలియకుండానే దూరం అయిపోతున్నారు హరీష్ శంకర్. ఇప్పటివరకు ఈయన చేసిన సినిమాల్లో 90% మెగా హీరోలతోనే ఉండటం గమనార్హం. రవితేజతో షాక్, మిరపకాయ.. జూనియర్ ఎన్టీఆర్ తో రామయ్యా వస్తావయ్యా సినిమాలు మినహాయిస్తే మిగిలిన సినిమాలు అన్ని మెగా కాంపౌండ్ లోనే చేసాడు హరీష్ శంకర్. పైగా హీరోలందరికీ ఈ దర్శకుడు బాగా కలిసి వచ్చాడు. పవన్ కళ్యాణ్ కి గబ్బర్ సింగ్.. సాయి ధరమ్ కు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్.. అల్లు అర్జున్ కు డిజె.. ఈ ఏడాది వరుణ్ తేజ్ కు గద్దలకొండ గణేష్ సినిమాలు ఇచ్చాడు ఈ దర్శకుడు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ కోసం కధ సిద్ధం చేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు చరణ్ సినిమా డైలాగ్ లో పడటంతో అక్కినేని హీరోల కోసం హరీష్ శంకర్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. దాంతో అఖిల్ అక్కినేని కోసం  హరీష్ శంకర్ ట్రై చేస్తున్నాడు. ఈయన ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత హరీష్ వెళ్లి అఖిల్ కు కథ చెబుతాడని తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. అన్నీ కుదిరితే 2020 లోనే ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఈ దర్శకుడి తర్వాత సినిమా ఏంటో త్వరలోనే క్లారిటీ రానుంది. అప్పటి వరకు ఈ సస్పెన్స్ తప్పదు.

More Related Stories