English   

పవన్ కళ్యాణ్ సినిమా అంటే అంత వీజీ కాదు రాజుగారు..

pk
2020-01-27 08:27:14

పాపం ఇప్పుడు దిల్ రాజును చూసి ఇదే అంటున్నారు మిగిలిన నిర్మాతలు. పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా అయినా చేయాలి అని ఇండస్ట్రీ లో ప్రతి నిర్మాత కోరుకుంటాడు. దిల్ రాజు కూడా ఈ అవకాశం కోసం 20 ఏళ్లుగా వేచి చూస్తున్నాడు. ఇన్నాళ్లకు అది వచ్చింది కానీ తిప్పలు కూడా వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలంటే ఆ మాత్రం కష్టపడాలి. ప్రస్తుతం ఇండస్ట్రీలో పరిస్థితులు చూస్తే అదే అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ తో సినిమా కమిట్ అయితే సరిపోదు ఆయనతో సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లాలంటే దర్శక నిర్మాతలు చాలా కష్టపడాలి. ఆయన డేట్స్ సంపాదించడం అంటే ఇప్పుడు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడమే. రాజకీయాల్లో ఎంతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ అది వదిలేసి ఇక్కడ సినిమా చేస్తాడు అంటే అంత నమ్మశక్యంగా అనిపించడం లేదు. కానీ బోనికపూర్, దిల్ రాజు మాత్రం ఈయన సినిమాలు చేస్తాడు అంటూ ప్రకటించేశారు. అన్నట్లుగానే పింక్ సినిమా రీమేక్ ఒక రోజు షూటింగ్ కూడా జరిగింది. దానికి పవన్ కళ్యాణ్ కూడా వచ్చాడు. ఫోటోలు బయటకు లీకయ్యాయి కూడా.

ఈ సినిమా కోసం కేవలం 25 రోజుల కాల్షీట్స్ మాత్రమే ఇచ్చాడు పవన్ కళ్యాణ్. 25 రోజులు ఇస్తే చాలు మేము సినిమా పూర్తి చేసుకుంటారు అని పవన్ కళ్యాణ్ ను అడిగినట్లు తెలుస్తుంది. పవన్ ఈ సినిమాకు డేట్స్ ఇచ్చినా కూడా ఆయన అనుకున్న సమయానికి షూటింగ్ కు వస్తాడా రాడా అనేది చాలా పెద్ద ప్రశ్నగా మారింది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఏ నాయకుడైనా జనాల ముందుకు వెళ్లడానికి కాస్త ఆలోచిస్తాడు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఓడిపోయిన తర్వాత ఇంకా ఎక్కువగా జనాల్లో కనిపిస్తున్నాడు. తనకు గెలుపు ఓటమి అనేది ముఖ్యం కాదని ప్రజలకు మంచి చేయడం సేవ చేయడం మాత్రమే తెలుసు అంటున్నాడు జనసేనాని. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి సినిమాలు చేయించడం అంటే చిన్న విషయం కాదు. దాని కోసం దర్శక నిర్మాతల తలప్రాణం తోకలోకి వస్తుంది. గతంలో ఇలాగే పవన్ కళ్యాణ్ కోసం వేచి చూసి చూసి చివరికి ఎలాంటి సినిమాలు చేయకుండానే ఖాళీగానే ఉండిపోయాడు దర్శకుడు సంతోష్ శ్రీనివాస్. ఇప్పుడు మళ్లీ వేణు శ్రీరామ్ పరిస్థితి కూడా ఇలాగే అవుతుందేమో అని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. కానీ పింక్ రీమేక్ షూటింగ్ మొదలు పెట్టాడు పవన్ కళ్యాణ్ కానీ అది అనుకున్న టైంకు పూర్తి అవుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా కథను పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు సరిపోయేలా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు కొన్ని మార్పులు చేశాడు వేణు శ్రీరామ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఎప్పుడు వచ్చి సినిమా పూర్తి చేస్తాడో చూడాలి. కానీ దిల్ రాజు మాత్రం మార్చిలోపు ఈ సినిమాను పూర్తిచేస్తాం అంటున్నాడు. మేలో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో కూడా పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఏఎం రత్నం దీనికి నిర్మాత. ఇందులో బందిపోటు టైగర్ నాగేశ్వరరావు పాత్రలో పవన్ నటిస్తాడని ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా కూడా ఒక వైపు రాజకీయాలు మరోవైపు సినిమాలు సరిగ్గా బ్యాలెన్స్ చేయాలంటే చాలా కష్టం. దీన్ని పవన్ కళ్యాణ్ ఎంత వరకు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేస్తాడు అనేది చూడాలి.

More Related Stories