ఓవైసీ బ్రదర్స్‌ను టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్

హైదరాబాద్‌లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో భారతమాత మహా హారతి కార్యక్రమం జరిగింది. గవర్నర్ తమిళసై, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, పవన్ కల్యాణ్ సహా పలువురు నేతలు హాజరయ్యారు. భారత మాతకు మహా హారతిలో ఓవైసీ బ్రదర్స్ పేర్లను ప్రస్తావించకుండానే పంచ్‌లు వేశారు. అన్నదమ్ముల్లకు గట్టి కౌంటర్ ఇచ్చారు.
15 నిమిషాల్లో హిందువులను ఊచకోత కోస్తామనే సెక్యూలరిజం వద్దని పవన్ కల్యాణ్ ఘాటుగా రిప్లై ఇవ్వగా.... అందరితో భారత్ మాతాకు జై కొట్టిస్తానన్నారు కిషన్ రెడ్డి. తన మెడపై కత్తి పెట్టినా భారత్ మాతా కీ జై అనను అంటూ ఓ వ్యక్తి అన్నారని అసదుద్దీన్ కామెంట్లను ప్రస్తావించారు. అందరితోనూ భారత్ మాతాకి జై అనిపిస్తామని చెప్పారు. అందుకోసమే భారతమాతకు మహా హారతి కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇటు పవన్ కల్యాణ్ కూడా ఓవైసీ బ్రదర్స్‌ను టార్గెట్ చేశారు.
మనదేశంలో 15 నిమిషాల్లో హిందువులను ఊచకోత కోస్తామనే సెక్యూలరిజం ఉందంటూ అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలను ప్రస్తావించారు. అలాంటి సెక్యులరిజం మనకు అవసరం లేదన్నారు. మోడీ నాయకత్వంలో దేశం బలంగా ఉందన్నారు. శత్రుదేశాలను గజగజ వణికించే శక్తి మోడీకి ఉందన్నారు. ప్రభావితం చేసే, దేశాన్ని రక్షించే నాయకత్వం కావాలి.. అది బీజేపీ, దాని అనుబంధ సంస్థలో ఉందన్నారు పవన్ .