English   

ఎట్టకేలకి సీటీమార్ కొట్టేశాడు

Seetimaarr
2020-01-27 10:21:16

తెలుగులో యాక్షన్ హీరోగా గోపీచంద్ కి మంచి క్రేజ్ వుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించే ఎన్నో సినిమాలు ఆయన గతంలో చేశాడు. అయితే సరయిన సక్సెస్ అనేది ఆయన ఖాతాలో పడి చాలా ఏళ్ళు అయింది. సినిమాల ఎంపికలో ఆయన ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా విజయం మాత్రం ఆయన వైపు తొంగిచూడటం లేదు. ఆయన సంపత్ నంది దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. 

ఈ చిత్ర టైటిల్‌ను, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ని యూనిట్ కాసేపటి క్రితం విడుదల చేసింది. ఇక ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ సినిమా కోసం కోచ్‌ అవతారం ఎత్తిన గోపిచంద్‌ నెత్తిన టోపీ ధరించి, విజిల్‌ చేత పట్టుకొని ఆటగాళ్లను కూతకు సిద్దం చేస్తున్నట్లుగా గోపిచంద్‌ కనిపిస్తున్నాడు. తమన్నా, దిగంగనా సూర్యవంశీ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాని శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. 

ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. కబడ్డీ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఆంధ్ర మహిళల జట్టు కోచ్‌గా గోపీచంద్‌, తెలంగాణ మహిళల జట్టు కోచ్‌గా తమన్నా నటిస్తున్నారు. హీరో గోపీచంద్‌ అక్కగా భూమిక నటిస్తున్న ఈ సినిమా శోటింగ్ పశివేదల చెరకు బట్టీ ఆ పరిసరాల్లో కొనసాగింది. రాజమండ్రి షెడ్యూల్‌ తర్వాత ఈ సినిమా చిత్రీకరణను చిత్రబృందం ఢిల్లీలో ప్లాన్‌ చేసిందట. ఈ సినిమా ఈ వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారు.

More Related Stories