శ్రీకారం ఫస్ట్ లుక్..రైతుగా శర్వానంద్

ప్రస్తుతం హీరో శర్వానంద్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తమిళ చిత్రం 96కి రీమేక్ గా దిల్ రాజు బ్యానర్ లో జాను అనే సినిమాతో పాటు శ్రీకారం అనే సినిమా కూడా చేస్తున్నాడు. కిశోర్ రెడ్డి అనే దర్శకుడు పరిచయం అవుతున్న ఈ సినిమాకి సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. దీనికి సంబందించిన ఫస్ట్ లుక్ కొద్ది సేపటి క్రితం రిలీజ్ చేశారు.
14 రీల్స్ వారి రెండో బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి మిక్కి జె.మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఇతను మన కేశవుల కొడుకు ...పొద్దున్నే పొలం పనికి వెళ్తున్నాడు చూడండి ' అంటూ ఆ లుక్ ని రిలీజ్ చేశారు మేకర్స్. శర్వానంద్ 29వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా ఈ ఏడాది వేసవికే విడుదల చేయనున్నట్టు ఆ లుక్ లోనే మేకర్స్ ప్రకటించారు. అయితే దర్శకుడు నిర్మాతల పేర్లు ప్రకటించిన యూనిట్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా ఎవరు నటిస్తున్నారనేది తెలియాల్సి ఉంది.
ఈ దర్శకుడు కిషోర్ రెడ్డి శ్రీకారం టైటిల్ తోనే నాలుగేళ్ల క్రితం షార్ట్ ఫిలిం తీశాడు. వ్యవసాయం నేపధ్యంలో ఈ షార్ట్ ఫిలిం తీయగా అప్పట్లో అది చాలా మందిని ఆకట్టుకుంది. ఇప్పుడు అదే షార్ట్ ఫిలిం కథని రెండు గంటల సినిమాగా మలచి శర్వానంద్ హీరోగా తెరకెక్కిస్తున్నారు. ఈ లుక్ లో లుంగీ పైన షర్ట్, భుజాన తువ్వాలుతో రైతు లుక్ లో అదరగొడుతున్నాడు.