English   

మహా సముద్రంలోకి దిగడానికి సిద్ధమవుతున్న శర్వానంద్.. 

Sharwanand
2020-01-27 16:51:34

ఆర్ఎక్స్ 100 సినిమాతో దర్శకుడిగా మారాడు అజయ్ భూపతి. తేడాది చిన్న సినిమాతో ఇండ‌స్ట్రీలో సంచ‌ల‌నం సృష్టించిన ఈయ‌న ఇప్పుడు మహా సముద్రం అనే మరో కథతో వస్తున్నాడు. ఇందులో ర‌వితేజ క్రిమిన‌ల్‌గా నటిస్తాడని ముందు చప్పాడు అజయ్. కానీ ఇందులోంచి మాస్ రాజా సడన్ గా తప్పుకున్నాడు. 

ఆ తర్వాత ఛీప్ స్టార్స్ అంటూ అజయ్ కాంట్రవర్సీ కామెంట్స్ కూడా చేసాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు మహా సముద్రం సినిమాకు మళ్లీ రెక్కలొచ్చినట్లు తెలుస్తుంది. నాగ చైతన్య, రవితేజ ఇలా చాలా మంది స్టార్స్ ను దాటుకుని చివరికి శర్వానంద్ దగ్గర ఈ చిత్ర కథ ఆగినట్లు ప్రచారం జరుగుతుంది. 

ఈ దర్శకుడి రెండో సినిమా ఇంకా పట్టాలెక్కలేదు కానీ అప్పుడే మూడో సినిమాకు కమిట్ మెంట్ ఇచ్చేసాడు అజయ్ భూపతి. ఈ దర్శకుడి మూడో సినిమాను తామే నిర్మించబోతున్నట్లు అనౌన్స్ చేసింది భవ్య క్రియేషన్స్. ఈ చిత్రం 2021లో పట్టాలెక్కనుంది. ఇది కూడా తన స్టైల్లో సాగే కథే. ఇదిలా ఉంటే వీలైనంత త్వ‌ర‌గా మహా సముద్రం సినిమా పూర్తి చేయాలని చూస్తున్నాడు అజయ్ భూపతి. 

ఇందులో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తారని తెలుస్తుంది. మొత్తానికి మహా సముద్రంలోకి దిగడానికి సిద్ధమవుతున్నాడు ఈయన. అంతేకాదు.. ఇందులో సమంత అక్కినేని కూడా నటించబోతుందనే ప్రచారం అయితే జరుగుతుంది. 96 కాంబినేషన్ రిపీట్ చేయడానికి చూస్తున్నాడు అజయ్ భూపతి. మరి ఏం జరుగుతుందో చూడాలిక. 

More Related Stories