English   

పవన్ కళ్యాణ్‌కు బండ్ల గణేష్ భజన.. కారణమేంటో..

pk
2020-01-28 02:54:12

బండ్ల గణేష్.. ఈయన పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లో కూడా కావాల్సినంత కామెడీ చేసాడు ఈయన. గణేష్ 7 క్లాక్ బ్లేడ్ జోక్ ఇప్పటికీ సంచలనమే. ఆ మధ్య ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి కొన్ని రోజుల పాటు హడావిడి చేసాడు ఈయన. పార్టీ ఓడిపోగానే పత్తా లేకుండా పోయాడు బండ్ల. ఇక ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత మళ్లీ తెరపై కనిపించాడు గణేష్. ఈ మధ్యే సరిలేరు నీకెవ్వరు సినిమాలో కామెడీ చేసాడు గణేష్. ఈ చిత్రంలో తన పాత్రపై కొన్ని సెటైర్లు కూడా వచ్చాయి. అయితే అనిల్ రావిపూడి తనను మోసం చేసాడని.. తన సన్నివేశాలు కట్ చేసాడని సన్నిహితులతో ఈయన చెప్పుకుని బాధ పడినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే తన జీవితంలో తాను చేసిన అతిపెద్ద తప్పు రాజకీయాల్లోకి రావడం అంటూ ట్వీట్ చేసాడు బండ్ల గణేష్. ఇప్పట్నుంచి తనకు తెలిసింది సినిమా సినిమా సినిమా అంటూ పోస్ట్ చేసాడు ఈయన. అక్కడితో ఆగకుండా మెగా భజన కూడా మొదలు పెట్టాడు. నేను భయంతో రాలేదు.. బాధ్యతతో వచ్చాను అని పవన్ కల్యాణ్ పోస్ట్ చేసిన ఫోటోను షేర్ చేసాడు బండ్ల. దీన్నిబట్టి మళ్లీ పవన్ భజన మొదలైందని అర్థం చేసుకోవచ్చు. దాని కిందే సుస్వాగతం సినిమాలో పవన్ తో ఉన్న వీడియోను పోస్ట్ చేసి.. 20 ఏళ్ళ కింద నా బాస్ తో అంటూ మరో పోస్ట్ పెట్టాడు. అంటే జనసేన వైపు అడుగేస్తున్నాడా లేదంటే పవన్ సినిమాల్లోకి వచ్చాడు కాబట్టి ఆయనతో సినిమా కోసం మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టాడా అనేది అర్థం కావడం లేదు. దాంతోపాటు చిరంజీవి అంటే తనకు ప్రాణం అని.. ఆయన మళ్లీ మళ్లీ రావాలని కోరుకుంటున్నాని మరో పోస్ట్ పెట్టాడు. ఉన్నట్లుండి చిరు, పవన్ కల్యాణ్ పై బండ్ల గణేష్ ఇలా పొగడ్తల వర్షం కురిపించడం వెనక అసలు రహస్యం ఏంటో అర్థం కావడం లేదు ఎవరికీ. ఈ మధ్య పవన్ కల్యాణ్ పై కొన్ని సెటైర్లు కూడా వేసాడు ఈ కమెడియన్. అప్పట్లో ఏపీలో ఉన్న పరిస్థితులపై గణేష్ నోరు విప్పాడు. మరీ ముఖ్యంగా పల్నాడు అంశంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు బండ్ల గణేష్. పల్నాటి గొడవలతో ఏపీ పరువు గంగలో కలిసిందంటూ ఆయన మండిపడ్డారు. ఇప్పటికే చాలాసార్లు చచ్చాము మనం.. మద్రాస్.. కర్నూల్.. హైదరాబాద్ అని వేధింపులకు గురయ్యాము కదా..

ఇప్పుడు పోలవరాన్ని, అమరావతిని అటకెక్కించారని దుయ్యబట్టాడు గణేష్. ఆంధ్రప్రదేశ్ మరో బీహార్ అయిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేసాడు ఈయన. ఇప్పట్లో ఇంకో ఎన్నికలు లేవని వైసీపీ, టీడీపీ ఎప్పుడు తెలుసుకుంటారని కౌంటర్ వేసాడు. కక్ష్య సాధింపులతో పరువు బజారుకెక్కడం తప్ప ఇంకేం జరగదని ఆయన హితవు పలికారు. పాలనలోకి వచ్చిన ఇన్ని రోజుల తర్వాత కూడా ఏం చేయని జగన్ ఇప్పటికైనా నిద్ర లేస్తే బాగుంటుందని సూచించాడు గణేష్. ఏ జండాలేని, ఎజెండా లేని నాయకులు కూడా కొన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకుంటే మంచిదంటూ పవన్ కల్యాణ్‌ను ఉద్దేశిస్తూ బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కొన్ని రోజులు కూడా ప్రజలను ప్రశాంతంగా ఉండనివ్వరా అంటూ రెచ్చిపోయాడు. దగా పడ్డ తెలుగు ప్రజలారా మీరు ఏ నాయకుణ్ణి నమ్మొద్దు. మీకు సహాయం చేసే స్థితిలో నేను లేను. మనందరినీ ఆ భగవంతుడే కాపాడాలి. భావితరాలకు ఆయనే దిక్కు అంటూ బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేసాడు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ ను కూడా ఆయన టార్గెట్ చేయడమే ఇప్పుడు సంచలనంగా మారిపోయింది. అలాంటి బండ్ల మళ్లీ ఇప్పుడు అంతా కూల్ అయిపోయి.. నువ్వే నా దేవుడివి అంటున్నాడు. ఏదేమైనా కూడా రాజకీయాలు తనకు రావంటూనే రాజకీయం చేస్తున్నాడు బండ్ల గణేష్.

More Related Stories