English   

బాలయ్యకు విలన్‌గా టాలీవుడ్ టాప్ కమెడియన్..

nbk
2020-01-28 04:59:25

ఒక్కసారి ఊహించుకోండి.. బాలయ్య లాంటి స్టార్ హీరో సినిమాలో కమెడియన్ విలన్ గా నటిస్తే ఎలా ఉంటుంది..? అసలు ఆ ఊహ కూడా చాలా విచిత్రంగా ఉంది కదా.. అయితే బోయపాటి శ్రీను సినిమాలో ఇప్పుడు ఈ చిత్రమే జరగబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఎప్పుడూ కొత్తదనం కోసం తపించే బాలయ్య తన సినిమాలోనే అది చూపించాలనుకుంటున్నాడు. పైగా బోయపాటి కూడా అప్పుడప్పుడూ తన సినిమాలతో హీరోలను విలన్లుగా మార్చేస్తుంటాడు. జగపతిబాబు, ఆది పినిశెట్టి లాంటి వాళ్లను అలాగే చేసి సక్సెస్ అయ్యాడు కూడా. ఇప్పుడు కూడా ఇదే చేయబోతున్నాడని తెలుస్తుంది. బాలయ్యతో చేయబోయే సినిమాలో సునీల్ ను విలన్ గా తీసుకుంటున్నాడని తెలుస్తుంది. బోయపాటి సినిమా కోసం పూర్తిగా కొత్త లుక్‌లోకి మారిపోయాడు నందమూరి నటసింహం. ఈ చిత్రం కోసం దాదాపు 20 కేజీలు తగ్గిపోయాడు బాలయ్య. గుండుతో కనిపిస్తున్నాడు బాలయ్య. ముందు ఆ భాగమే షూట్ చేస్తారని కూడా తెలుస్తుంది.

ఈ సినిమాలో ముందు నుంచి విలన్ ఎవరు అనే దానిపై చర్చ బాగానే జరుగుతుంది. ఇప్పుడు దీనికి సమాధానంగా సునీల్ పేరు వినిపిస్తుంది. అసలు బాలయ్యకు సునీల్ విలన్ ఏంటి అనుకోవచ్చు.. కానీ ఈ మధ్యే విడుదలైన డిస్కో రాజా సినిమాలో ఈయన ప్రతినాయక పాత్రలో నటించాడు. అయితే ఈ సినిమా ఫ్లాప్ కావడంతో సునీల్ విలనిజాన్ని ఆడియన్స్ చూడలేదు.. కానీ బాగానే చేసాడు. దాంతో ఇప్పుడు బాలయ్య తన సినిమా కోసం సునీల్ ను అడుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. జగపతిబాబు లెజెండ్ సినిమాతో ఎంతగా మేకోవర్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సునీల్ కు కూడా ఇప్పుడు ఈ సినిమా అలాగే మేకోవర్ అవుతుందని నమ్ముతున్నారు అభిమానులు. మరి అన్నీ నిజమై ఒకవేళ నిజంగానే సునీల్ విలన్ గా నటిస్తే మాత్రం అదో సంచలనమే.

More Related Stories