ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమా.. మీకర్థమవుతోందా..

కన్నడ క్యూటీ, హాట్ బ్యూటీ రష్మిక మందన్నా టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలు అందుకుంటోంది. ఛలో, గీత గోవిందం, డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరు ఇలా వరుస క్రేజీ చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మకు.. ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ వచ్చిందని సమాచారం. 'మీకర్ధమవుతోందా' అంటూ మహేష్ తో ఫుల్లుగా అల్లరి చేసిన రష్మిక.. ఎన్టీర్ మూవీలో ఛాన్స్ దక్కించుకున్నట్టు సమాచారం.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, జూనియర్ ఎన్టీతర్ కలయికలో వచ్చిన 'అరవింద సమేత' మూవీ తర్వాత.. మరో క్రేజీ ప్రాజెక్ట్ రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోనే రష్మికకు ఎన్టీఆర్కు జోడీగా రష్మిక మందన్న అయితే బాగుంటుందని భావిస్తున్నాడట త్రివిక్రమ్. దాంతో ఎగిరి గంతేస్తోందట ఈ చిన్నది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందా.. అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు సన్నిహత వర్గాల భోగట్టా.
ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' షూటింగ్లో బిజీగా వున్నారు. అది పూర్తి కాగానే త్రివిక్రమ్ చిత్రం సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. అలాగే సంక్రాంతి బరిలో దుమ్ము దులిపిన త్రివిక్రమ్.. ఎన్టీఆర్ తో చేసే సినిమాను కూడా వచ్చే ఏడాదిలో సంక్రాంతి విడుదలకు సన్నాహాలు చేస్తున్నాడని వినిపిస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారక ప్రకటన రావాల్సి ఉంది. ఏదైమైనా రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్-సుకుమార్ చిత్రంతో పాటు ఎన్టీఆర్ తో ఛాన్స్ కొట్టేసి ఫుల్ జోష్ లో ఉంది.