English   

సూపర్ స్టార్ మహేష్ బాబు... ఫేక్ రికార్డ్స్ కీ రాజా...

Mahesh Babu Fake Records.jpg
2020-01-28 09:42:18

ఇది మనం ఇచ్చిన బిరుదు కాదు.. సోషల్ మీడియాలో మహేష్ బాబుకు వచ్చిన బిరుదు. వినడానికి కాస్త విచిత్రంగా.. అభిమానులకు కాస్త బాధగానే ఉంటుంది కానీ కొన్నిసార్లు మహేష్ బాబు నిర్మాతలు అత్యుత్సాహంతో చేసే పనులు ఆయన్ని ఇబ్బందుల్లో పడేస్తున్నాయి. ముఖ్యంగా ఆయన సినిమాలు విడుదలైనపుడు ఫేక్ రికార్డుల గోల ఎక్కువగా వినిపిస్తుందని ఇప్పుడు కాదు చాలా ఏళ్ల నుంచి వినిపిస్తున్న మాట. ఎందుకంటే మహేష్ సినిమా వచ్చిందంటే ముందుగా మనకు కనిపించే పోస్టర్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్.

ప్రతీ సినిమాకు ఇది అలవాటుగా మారిపోయింది. ఇండస్ట్రీ హిట్ అనేది ఎప్పుడో ఓసారి వస్తుంది. కానీ మహేష్ విషయంలో మాత్రం ప్రతీసారి వస్తుంది. అదే నవ్వుల పాలు అయ్యేలా చేస్తుంది. ఇప్పుడు విడుదలైన సరిలేరు నీకెవ్వరు సినిమాకు కూడా ఇదే చేసాడు మహేష్. ఈయన సినిమా విడుదలై రెండు వారాలు గడిచిపోయింది. అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాతో పోటీపడి మరీ తన సినిమా రికార్డులను విడుదల చేస్తున్నాడు సూపర్ స్టార్. తాజాగా ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అంటూ మరో ప్రోమోతో పాటు పోస్టర్స్ కూడా విడుదల చేసారు దర్శక నిర్మాతలు. అందులో నాన్ బాహుబలి 2 ఇన్ తెలుగు స్టేట్స్ అని ఉంది. అంటే బాహుబలి 1 రికార్డులను కూడా తమ సినిమా అధిగమించిందంటూ పోస్టర్స్ విడుదల చేసారు మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు నిర్మాతలు.

ఇది చూసి నిజంగానే నవ్వుకుంటున్నారు ప్రేక్షకులు. మంచి విజయాలను కూడా అనవసరంగా రికార్డుల పిచ్చిలో పడి మహేష్ తనను తానే మోసం చేసుకుంటున్నాడు అంటూ అభిమానులు కూడా హర్ట్ అవుతున్నారు. బాహుబలి తొలి భాగం తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 110 కోట్ల షేర్ వసూలు చేసింది. సరిలేరు నీకెవ్వరు అంతా తీసుకురాలేదని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఫేక్ రికార్డుల కోసం నిర్మాతలే ఇలా మహేష్ సినిమాను హైలైట్ చేస్తున్నారంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇలా ఫేక్ రికార్డుల వైపు మహేష్ అడుగులేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో మహర్షి సినిమా విషయంలో 232 కోట్లు అంటూ పోస్టర్ విడుదల చేసి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అన్నారు.. దానికి ముందు డిజాస్టర్ అయిన స్పైడర్ సినిమాకు 150 కోట్ల పోస్టర్ విడుదల చేసారు. ఇక బిజినెస్ మ్యాన్ సినిమా తొలివారం ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అంటూ ప్రెస్ మీట్ పెట్టి అడ్డంగా దొరికిపోయారు. దానికి ముందు అతిథి సినిమాకు 2007లోనే రెండు వారాలకు 32 కోట్ల షేర్ అంటూ పోస్టర్స్ విడుదల చేసి బాబోయ్ అనిపించారు.

ఇక బ్లాక్ బస్టర్ దూకుడు సినిమా విషయంలో కూడా చాలా ఫేక్ రికార్డులు చూపించే ప్రయత్నం చేసారు నిర్మాతలు. అప్పట్లో అన్ని రికార్డులు తమ సినిమా కొట్టేసిందంటూ అనవసరంగా దూకుడు విజయాన్ని కూడా తక్కువ చేసారు నిర్మాతలు అత్యుత్సాహంతో. ఇలా మహేష్ నటించే ప్రతీ సినిమాకు ఫేక్ రికార్డులు అలవాటైపోయాయి. మొత్తానికి ఈ ఫేక్ గోల ఎప్పటికి ఎక్కడ ఆగుతుందో చూడాలిక.

More Related Stories