English   

రాక్షసుడు... నాని వచ్చేశాడు...

Nani Rakshsudu.jpg
2020-01-28 11:52:19

నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు, నివేదా థామస్, అదితిరావు హైదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ వి. దిల్ రాజు నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద తెరక్కుతున్న ఈ సినిమాకి విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరున్న మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్నారు.

కృష్డుడి గీతలో ఎపుడో చెప్పారు.."రాక్షసుడు" ఎదిగిన నాడు ఒకడొస్తాడని.. వాడే ఇప్పుడొస్తున్నాడు..."రక్షకుడు" వస్తున్నాడు అంటూ నిన్న సుధీర్ బాబు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. చేతిలో గన్‌తో గురివైపు తీక్షణంగా చూస్తున్న సుధీర్ బాబు లుక్ ఆకట్టుకోగా ఈరోజు రాక్షసుడుగా నాని లుక్ రిలీజ్ చేశారు. నాని ఇందులో నెగటివ్ రోల్ చేస్తున్నాడని ముందు నుండీ చెబుతున్నారు.

ఇప్పుడు ఈ ఫస్ట్ లుక్ లో నాని ఫుల్ గడ్డంతో రఫ్ లుక్ లో చేతిలో కత్తెర అలాగే చేయి మీద నుండి కారుతున్న బ్లడ్ తో ఈ లుక్ తో నాని బాగా ఆకట్టుకున్నాడు. మొత్తానికి ఈ లుక్ సినిమా పై ఆసక్తిని పెంచిందనే చెప్పాలి. ఇప్పటికే చిత్రీకరణ పూతి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా మార్చి 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Related Stories