English   

ఎన్టీఆర్ - అల్లు అర్జున్ మల్టీస్టారర్... నిజమా...

NTR Allu Arjun.jpg
2020-01-28 21:24:40

ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి సీనియర్ నటులు చాలా మల్టీ స్టారర్ సినిమాలు చేశారు. అయితే ఆ తర్వాత వచ్చిన స్టార్ జనరేషన్లో మాత్రం కొంత వరకు మల్టీ స్టారర్ సినిమాలు తగ్గాయనే చెప్పాలి. చాలా కాలం వరకు ఎవరికి వారే ఒక గీత గీసుకొని.. ఫ్యాన్స్  ను దృష్టిలో పెట్టుకొని కమర్షియల్ చిత్రాలు చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు మళ్లీ ట్రెండ్ మారింది. ప్రస్తుతం స్టార్ హీరోల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. దాంతో మల్టీ స్టారర్ సినిమాలు ఊపందుకుంటున్నాయి. 

కమర్షియల్ హంగులతో కూడిన వైవిధ్యమైన సినిమాలు చేసేందుకు మన హీరోలు సై అంటున్నారు. అలాగే మంచి కథలు దొరికితే మల్టీస్టారర్ సినిమాలకు తాము సిద్దంగా ఉన్నామంటున్నారు. ఇలాంటి మల్టీస్టారర్ జాబితాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పేర్లు ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇటీవల వచ్చిన బన్నీ, అల వైకుంఠపురంలో సినిమా సందర్భంగా బన్నీ,తారక్ ఇద్దరు బావ అని సంభోదించడం బట్టి చూస్తే.. వీళ్లద్దరి మధ్య ఎంత సాన్నిహిత్యం ఉందో చెప్పనక్కర్లేదు.

దాంతో ఇప్పుడు ఈ స్టార్ హీరోల మల్టీ స్టారర్ సినిమా వస్తుందనే వార్త తెరపైకి వచ్చింది. అంతేకాదు ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించబోటున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే మాటల మాంత్రికుడు తన నెక్ట్స్ మూవీ ఎన్టీఆర్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. దాంతో ఈ సినిమాలో వీళ్లిద్దరు కలిసి నటించనున్నారా..? లేక మరో సినిమా ఉంటుందా..? అనే ఆసక్తి మొదలైంది. ఒకవేళ ఈ న్యూస్ నిజమైతే.. మెగాభిమానులు, నందమూరి ఫ్యాన్స్ కి పండగే అని చెప్పొచ్చు. ఇకపోతే.. ప్రస్తుతం ఎన్టీఆర్, రాజమౌళి ఆర్ఆర్ఆర్ లో నటిస్తుండగా.. బన్నీ-సుకుమార్ సినిమాలో నటిస్తున్నాడు.

More Related Stories