English   

సూపర్ స్టార్ రజినీకాంత్‌కు గాయాలు...

Superstar Rajanikanth.jpg
2020-01-28 21:51:54

ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత ఇండియా నుంచి మ్యాన్ వర్సెస్ వైల్డ్ షోకు వెళ్లిన మరో ప్రముఖుడు రజినీకాంత్. ఈయన జనవరి జనవరి 28 నుంచి మూడు రోజుల పాటు ఈ షో షూటింగ్ ప్లాన్ చేసాడు. డేట్స్ కూడా ఇచ్చి కర్టాటకలోని బందిఫుర రిజర్వ్ ఫారెస్ట్ కూడా వెళ్లాడు. అక్కడికి వెళ్లి షో హోస్ట్ బేర్ గ్రిల్స్ తో కొన్ని గంటల షూటింగ్ చేస్తుండగానే ఈయన గాయపడ్డాడు. షూటింగ్ లో భాగంగా అనుకోకుండా ఆయన కింద పడటంతో భుజానికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే గాయం తీవ్రత మరీ ఎక్కువేం కాదని.. అభిమానులు కంగారు పడాల్సిన పనేం లేదని తేల్చేసారు వైద్యులు. కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని తెలిపారు.

అయితే రజినీ అభిమానులు మాత్రం ఆయన కనిపించే వరకు కంగారు పడుతూనే ఉంటారు. అసలే ఈ మధ్య అనారోగ్యంతో బాధ పడుతున్న ఈయనకు ఇప్పుడు గాయాలు కావడం ఆందోళన పెంచేస్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే షూటింగ్‌కు ప్యాకప్ చెప్పి చెన్నై వెళ్లిపోయాడు. నయమైన తర్వాత మళ్లీ వచ్చి షూట్ చేయనున్నాడు రజినీ. కొన్ని రోజుల కింద ఈ షోలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. మొత్తానికి రజినీ గాయం ఇప్పుడు ట్రెండింగ్ అయిపోయింది. సినిమా సంగతికి వస్తే సిరుత్తై శివతో ఈయన సినిమా చేస్తున్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.

More Related Stories