షూట్ లో గాయాలు...క్లారిటీ ఇచ్చిన రజనీ

మ్యాన్ వర్సెస్ వైల్డ్ ప్రోగ్రామ్ కోసం కర్ణాటకలోని బందిపుర అటవీబాట పట్టారు రజనీ కాంత్. సాహసవీరుడు బియర్ గ్రిల్స్‌తో కలిసి షూటింగ్లో పాల్గొంటున్న సమయంలో రజనీ గాయపడినట్టుగా వార్తలు వెలువడ్డాయి. దీంతో, ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అలాంటిదేమీ లేదని సూపర్ హీరో వివరణ ఇవ్వడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. మ్యాన్ వర్సెస్ వైల్డ్ ప్రోగ్రామ్ షూటింగ్లో ఇంజూరీ అయినట్టుగా వచ్చిన వార్తలను... సూపర్ స్టార్ రజనీకాంత్ తోసిపుచ్చారు.
తనకు ఎలాంటి గాయాలు కాలేదని, అభిమానులు ఆందోళన చెందొద్దని క్లారిటీ ఇచ్చారు. తనకు ఎటువంటి గాయాలు కాలేదన్న ఆయన, చెట్టుకొమ్మలు అక్కడక్కడ గీసుకున్నాయని తెలిపారు. తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు స్పష్టం చేశారు. బియర్ గ్రిల్స్‌తో కలిసి కార్యక్రమంలో నటించడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు రజనీ. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన కార్యక్రమం మ్యాన్ వర్సెస్ వైల్డ్ కార్యక్రమం.
బియర్ గ్రిల్స్‌తో కలిసి ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొనడం ఎంతో అనుభూతినిచ్చిందని రజనీ హర్షం వ్యక్తం చేశారు. షూటింగ్ పూర్తవడంతోనే ఆయన చెన్నై చేరుకున్నారని సమాచారం.