రష్మిక పంట పండినట్టేనా...

ఛలో, గీత గోవిందం, వంటి క్రేజీ సినిమాల్లో నటించి హిట్స్ అందుకున్న నటిస్తున్న రష్మిక తాజాగా `సరిలేరు నీకెవ్వరు`తో తన ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని యాడ్ చేసుకుంది. అంటే ఈ విజయంలో ఆమెకి పెద్దగా పని లేకున్నా ఆమె సినిమానే కాబట్టి ఆమెకి కూడా ఇది ప్లస్ అయినట్టే. అయితే ఆమె గురించి ఒక ఆసక్తికర న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ‘అరవింద సమేత’ తరవాత ఎన్టీఆర్ - త్రివిక్రమ్ మరోసారి కలిసి పనిచేయనున్నారని ప్రచారం జరుగుతోంది.
ఆర్ఆర్ఆర్ షూట్ వ్రాప్ అవగానే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇందులో కధానాయికగా రష్మికను తీసుకున్నారని అంటున్నారు. సరిలేరు సినిమాలో ఆమె పెర్ఫార్మెన్స్ నచ్చి త్రివిక్రమ్ ఆమెకి ఛాన్స్ ఇచ్చినట్టు తెలిసింది. ఆమె త్వరలో వస్తున్న ‘భీష్మ’లో నితిన్‌కు జోడీగా కనిపించబోతోంది. అల్లు అర్జున్ తో సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రంతో రష్మిక నటిస్తున్న విషయం తెలిసిందే. దీని తర్వాత ఆమెకు సినిమాలేవీ లేవు.
అవకాశం వస్తే డేట్స్ సెట్ చేసుకుని అయినా ఆమె ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. చూడాలి ఇది ఎంతవరకూ నిజం అవుతుంది అనేది.