English   

స‌మంత‌ అంటే పిచ్చి...షాకిచ్చిన అభిమాని...

Samantha.jpg
2020-01-29 07:39:22

సినిమా స్టార్స్ కు ఉండే ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పక్కర్లేదు. ఒక్కోసారి వాళ్లు చేసే పనులు ఎవరు ఊహించలేం. తమకు నచ్చిన స్టార్స్ డైరెక్ట్ గా కనిపిస్తే.. వాళ్ల ఆనందానికి అవధులు ఉండవు. ఆ సమయంలో వాళ్లు చేసే హంగామా మామూలు గా ఉండదు. అలాగే ఒక్కో అభిమాని తమ అభిమానాన్ని సోషల్ మీడియా ద్వారా ఒక్కో విధంగా వ్యక్తపరుస్తుంటారు. తాజాగా సమంత పై కూడా అలాంటి ప్రేమే చూపించి ఔరా అనిపించాడు ఓ అభిమాని.

ప్రేమ్‌కుమార్ ద‌ర్శక‌త్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న 'జాను' చిత్రంలో..స‌మంత,శర్వానంద్ జంటగా న‌టిస్తున్నారు. త‌మిళ హిట్ చిత్రం '96' అనే చిత్రానికి ఈ సినిమా రీమేక్ గా తెరకెక్కుతోంది. రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన 'ఊహ‌లే ఊహ‌లే.. అంటూ సాగే లిరిక‌ల్ సాంగ్ రిలీజ్ అయింది. ఈ పాట వైర‌ల్ గా మారింది. దాంతో ఓ అభిమాని సోష‌ల్ మీడియా ద్వారా సమంత పై తన అభిమానాన్ని చాటుకున్నాడు. దాంతో సమంత షాక్ అయినంత పని చేసి.. చాలా క్యూట్ గా రిప్లే ఇచ్చింది. 

'ఐ ల‌వ్ యూ సామ్' అంటూ 3 గంట‌ల 15 నిమిషాల పాటు రామ కోటి రాసినట్టుగా.. సమంత నామకరణ చేస్తూ.. జాను కోటి రాయడం ఇప్పుడు వైరల్ గా మారింది. త‌న త‌ల్లి మంద‌లించిన ప‌ట్టువ‌ద‌ల‌కుండా రాశాన‌ని.. ఓ అభిమాని సోష‌ల్ మీడియా ద్వారా తన అభిమానాన్ని పంచుకున్నాడు. దాంతో స‌మంత 'ఓ గోష్ మీ అమ్మ నాపై చాలా కోపంగా ఉన్నట్టుంది. నాపై ఉన్న ప్రేమ‌కు థ్యాంక్స్.. కానీ బుద్దిగా చదువుకో' అంటూ రిప్లే ఇస్తూ ట్వీట్ చేయ‌డం విశేషం. దాంతో.. నీ ఓపికకు దండం రా బాబు అంటూ సెటైర్లు వేస్తున్నారు చాలా మంది. ఏదేమైనా ఇలాంటి ఫ్యాన్స్ కూడా ఉంటారు సుమా...

More Related Stories