English   

వామ్మో మనోజ్ కి మళ్ళీ పెళ్ళా

Manchu Manoj
2020-01-29 09:41:04

మంచు హీరో మనోజ్‌ కి కొంత కాలంగా అసలు టైం బాలేదు. మూడేళ్ళ క్రితం ఒక్కడు మిగిలాడు సినిమాతో ప్రేక్షకులను పలకరించిన మనోజ్ ఆ తరువాత మరే సినిమా చేయలేదు. అలా కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయినా సామాజిక మాధ్యమాల వేదికగా ఎప్పటికప్పుడు అభిమానులను పలకరిస్తుంటారు. ఈ మధ్యే ఆయన తన భార్య నుండి విడాకులు కూడా తీసుకున్నారు.

ఆయన తాజాగా ‘అన్ని కుదిరాయి. వారంలో ఓ శుభవార్త వినిపించబోతున్నా. వేచి చూడండి’ అని ట్వీట్‌ చేశాడాయన. తన ఫొటో ఒకటి షేర్‌ చేసిన ఆయన ఆ కామెంట్ పెట్టాడు. దీన్ని చూస్తుంటే ఆయన నటించబోయే కొత్త చిత్రం ప్రకటించేలా ఉన్నాడు. దీన్ని చూసిన నెటిజన్లు ‘ఆల్‌ ది బెస్ట్, కంగ్రాట్స్, త్వరగా చెప్పండి మనోజ్‌’ అంటూ చాలా కామెంట్స్‌ పెట్టారు.

అయితే  ఓ నెటిజన్‌ మాత్రం ఒక అడుగు ముందుకు వేసి మరీ ‘ఏంటి ఇంకో మ్యారేజా?’ అని అడిగాడు. దానికి ‘వామ్మో’ అని సమాధానం ఇచ్చాడు మనోజ్‌. ఈ ట్వీట్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇదన్న మాట సంగతి. మనోజ్‌ ఒకటి చెప్తే, నెటిజన్లకి మరోలా అర్ధం అయింది. ఇంతకీ మనోజ్ చెప్పాలనుకున్న మరి ఆ ఆసక్తికర వార్త ఏంటో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. 

More Related Stories