English   

బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడి పరిస్థితి విషమం

Mission Mangal
2020-01-29 10:08:28

ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ జాబితాలో చేరిపోయాడు 'జగన్ శక్తి'. ఈయన గతేడాది వచ్చిన బాలీవుడ్ స్టార్ హీరో 'అక్షయ్ కుమార్' బ్లాక్ బస్టర్ మూవీ 'మిషన్ మంగళ్' చిత్రాన్ని తెరకెక్కించి విమర్శకుల చేత ఔరా అనిపించుకున్నాడు. అలాంటి దర్శకుడి ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు విషమంగా ఉందని తెలుస్తోంది. కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాగోలేదట. 

'జగన్ శక్తి' ముంబయిలో తన సన్నిహితులతో కలిసి ఓ పార్టీకి అటెండ్ అయ్యాడు. అక్కడ ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడట. దాంతో వెంటనే జగన్ శక్తిని కుటుంబ సభ్యులు సమీపంలోని హాస్పిటల్ కి తరలించారు. ఆయనను పరీక్షించిన వైద్యులు.. బ్రెయిన్ లో రక్తం గడ్డకట్టినట్టు నిర్థారించారు. దాంతో ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిసి.. అతని సన్నిహితులు చాలా ఆందోళన చెందుతున్నారు. 

మిషన్ మంగళ్ తర్వాత.. జగన్ శక్తి పెద్ద హీరోల నుండి రెండు మూడు ఆఫర్లు అందుకున్నాడు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ తో ఓ సినిమా చేస్తున్నాడు. దాంతో ఇప్పుడు ఉన్నట్టుండి హఠాత్తుగా అనారోగ్యం పాలవడంతో.. అతను కోలుకోవాలని సన్నిహితులు మరియు శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు. అలాగే బాలీవుడ్ వర్గాలు జగన్ శక్తి త్వరగా మామూలు మనిషి అవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటున్నారు. మనం కూడా అతను త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.

More Related Stories