English   

పవన్ కళ్యాణ్, క్రిష్ సినిమా మొదలైందోచ్.. 

Pawan Kalyan
2020-01-29 11:56:26

వరస సినిమాలతో బిజీ అయిపోతున్నాడు పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న వేణు శ్రీరామ్ సినిమా స్టార్ట్ చేసిన ఈయన.. ఇప్పుడు క్రిష్ సినిమాను కూడా మొదలుపెట్టాడు. నానక్ రామ్ గూడలో క్రిష్ సినిమా మొదలు పెట్టాడు పవన్. ఈ సినిమాను ఏఎం రత్నం నిర్మిస్తున్నాడు. చాలా రోజుల నుంచి పవన్, క్రిష్ సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత మరో సినిమా ఏదీ చేయని క్రిష్ ఇప్పుడు పవన్ కోసం కథ సిద్ధం చేస్తున్నాడు. ఈ సినిమా కథ బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేసాడనే వార్తలు వినిపిస్తున్నాయి. 

ముందు నుంచి అనుకుంటున్నట్లుగానే ఈ చిత్రాన్ని AM రత్నం నిర్మిస్తున్నాడు. చాలా రోజుల కిందే ఈయన సినిమాకు కమిట్మెంట్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. అప్పట్లో నీసన్ సినిమాను కూడా మొదలుపెట్టి ఆపేసాడు. అయితే అప్పుడు ఇచ్చిన మాటను ఇప్పుడు పూర్తి చేస్తున్నాడు పవర్ స్టార్. యాక్షన్ సబ్జెక్టుగా ఇది ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు పవర్ స్టార్. దీనికోసం కూడా తక్కువ రోజులే కాల్షీట్స్ ఇచ్చాడు. 

మొత్తానికి ఇన్ని రోజులు సినిమాలు చేస్తాడా చేయడా అనే కన్ఫ్యూజన్ నుంచి ఒకేసారి రెండు సినిమాలు చేస్తున్నాడు పవర్ స్టార్. మే లో పింక్ సినిమా విడుదల కానుంటే.. ఇది వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. 

More Related Stories