బాలయ్య అభిమానులకి శుభవార్త

నట సింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కాంబినేషన్లో సినిమా తెరకేక్కుతోందన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గతేడాది చివర్లో పూజా కార్యక్రమాలతో లాంఛ్ అయ్యింది. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలు కావాల్సి ఉన్నా వ్యక్తిగత కారణాల వల్ల మొదలుకాలేదు. అయితే ఇప్పుడు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌కి రెడీ అయింది.
తాజా సమాచారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 15 నుండి ప్రారంభమవుతుందని అంటున్నారు. ఈ సినిమాలో శ్రీకాంత్ విలన్‌గా నటిస్తుండగా సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. జయజానకి నాయకకి నిర్మాతగా వ్యవహరించిన మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలైలో సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట.
చాలా కాలంగా బాలయ్య అభిమానులు సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. బోయపాటి అయితే హిట్ ఖాయం అని ఈ ప్రాజెక్ట్ కోసం ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న అభిమానులు షూటింగ్ ఆలస్యం కావడంతో నిరాశకు లోనవుతున్నారు. ఇప్పుడు ఈ షూట్ అప్డేట్ వచ్చింది కాబట్టి వారికి గుడ్ న్యూస్ అనే చెప్పాలి.