English   

జపాన్ లో రచ్చ చేస్తోన్న సాహో

Saaho
2020-01-29 14:36:20

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన “బాహుబలి”, “బాహుబలి 2″ సిరీస్ సినిమాలు భారీ హిట్స్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలకి పని చేసిన అందరికీ మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ కలెక్షన్స్ తో తెలుగు సినిమా సత్తా చాటాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ సినిమాల దెబ్బకి ప్రభాస్ కు దేశ, విదేశాలలో అభిమానులు పెరిగారు. ఒకప్పుడు రజనీకి ఉన్నట్టే ఇప్పుడు జపాన్ లో ప్రభాస్ కి కూడా ఫ్యాన్ క్లబ్ లు వెలిశాయి. 

ఇక బాహుబలి తర్వాత తన సొంత స్నేహితుల సంస్థ అయిన యువి క్రియేషన్స్, టి – సిరీస్ బ్యానర్స్ పై సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో తెలుగు, తమిళ, హిందీ భాషలలో తెరకెక్కిన స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ “సాహో” మూవీ రిలీజయినా అంచనాలను పెద్దగా అందుకోలేక పోయింది. ప్రభాస్ క్రేజ్ తో సినిమా కమర్షియల్ గా విజయం సాధించినా కంటెంట్ పరంగా మాత్రం మెప్పించలేకపోయింది. అయితే అదృష్టమో దురదృష్టమో కానీ బాలీవుడ్ ప్రేక్షకులు ఈ మూవీ కి బ్రహ్మ రథం పట్టారు. అయితే జపనీస్ సబ్ టైటిల్స్ తో రూపొందిన “సాహో” మూవీ జపనీస్ వెర్షన్ థియేటర్స్ లో 27వ తేదీ జపాన్ లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి జపనీస్ ప్రేక్షకుల నుండి అద్భుత రెస్పాన్స్ వస్తోందని అంటున్నారు. 

More Related Stories