English   

టైగర్ ఫారెస్ట్ లో రజనీ కాంత్...అందుకే

Rajinikanth
2020-01-29 15:03:32

డిస్కవరీ ఛానల్‌లో ప్రసారం అయ్యే 'మ్యాన్ వర్సెస్ వైల్డ్' కార్యక్రమం గురించి ఆ ప్రోగ్రాంను ఫాలో అయ్యే వారందరికీ తెలుసు. అయితే గతేడాది ఆ ప్రోగ్రాంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనడంతో ఇలాంటి ఒక ప్రోగ్రాం ఉందని దాదపు అందరికీ తెలిసింది. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెబుతున్నామంటే ఇప్పుడు ఇదే కార్యక్రమానికి సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా హాజరు కానున్నారు. 

ప్రస్తుతం ఈ డాక్యుమెంటరీ షూటింగ్ కర్నాటకలోని బండిపురా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో జరుగుతోంది. ఈ డాక్యుమెంటరీ షూటింగ్‌ కోసం రజనీ ఆ అడవిలోనే రెండు రోజులు పాటు ఉండనున్నట్టు సమాచారం. బేర్ గ్రిల్స్ అనే సాహసికుడు మేన్ వర్సెస్ వైల్డ్ కార్యక్రమంలో అడవులు, నదులు, కొండల్లో తిరుగుతూ ఉంటాడు. 

ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఒక మనిషి పొరపాటున అలా అడవుల్లోనో, నదుల్లోలోనో, కొండల్లోనో చిక్కుకుపోతే ఎలా బతకాలి. ఎలాంటివి తినాలి అనేవి చేసి చూపిస్తుంటాడు. ఎలాంటి సదుపాయాలూ, ఆహారమూ లేకపోయినా అడవుల్లో, ఎడారుల్లో ఎలా బతకగలగాలో ఆ ప్రోగ్రాం ద్వారా తెలిసేలా చేస్తాడు. అందుకే ఈ షోకి మంచి రేటింగ్ కూడా ఉంది. అప్పుడప్పుడూ ఇలా స్టార్స్ ని కూడా షోకి తీసుకొచ్చి జనాల్లోకి మరింత వెళ్ళేలా ప్రయత్నం చేస్తుంటారు నిర్వాహకులు. 

More Related Stories