English   

పృధ్వీ మీద విచారణ ఏమయింది...అంత చేశారా  

Prudhvi Raj
2020-01-29 22:13:42

కొంతమంది ఎంత వేగంగా ఎదుగుతారో అంతే వేగంగా పాతాళంలోకి జారిపోతారు. కమెడియన్ పృధ్వీ విషయంలోనూ అదే జరిగింది. ఎప్పుడు కొడదామా అని ఎదురు చూస్తున్న వాళ్లకు ఈజీగా దొరికిపోయారు. సెల్ఫ్‌గోల్‌ వేసుకుని మరీ పరువు తీసుకున్నారు. ఒక్క ఫోక్‌ కాల్‌తో థర్టీ యియర్స్ ఇండస్ట్రీ అనుకునే ఆయన తలరాత మారిపోయింది. రాజకీయ జీవితం తల్లకిందులైంది. మరి ఆయనపై అసలు విచారణ జరిగిందా? జరుగుతోందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఓ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగినితో పృథ్వీ మాట్లాడిన ఫోన్‌ కాల్‌ రికార్డింగ్‌ బయట పడటం ఆయన రాజకీయ జీవితాన్ని తల్లకిందులు చేసింది. ఉదయం మొదలైన ఎపిసోడ్‌లో సాయంత్రానికే ఎండ్‌ కార్డ్‌ పడింది.

మీడియా ముందుకు వచ్చి పృథ్వీ సుదీర్ఘ వివరణ ఇచ్చినా ప్రజలు మాత్రం దానిని  కామెడీ గానే చూశారు. ఆ వాయిస్ లతో టిక్ టాక్ లు కూడా చేస్తున్నారు అంటేనే అర్ధం చేసుకోవచ్చు. ఆడియో టేపుల వ్యవహారం టీటీడీ ప్రతిష్టకు భంగంగా మారడంతో చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి విజిలెన్స్‌ దర్యాప్తునకు ఆదేశించారు. ఆయన ఆదేశాలతో విజిలెన్స్‌ బృందాలు ఉద్యోగులతో మాట్లాడాయి. పృథ్వీ ప్రవర్తనపై ఆరా తీశాయి. ఆయన ఫోన్‌ సంభాషణలకు సంబంధించిన ఆడియో టేపులను ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపారు. టేపుల్లోని ఆడియో పృథ్వీదేనని నిర్ధారించారు. వైవీ సుబ్బారెడ్డికి సమాచారం ఇచ్చారు. ఆ వెంటనే పృథ్వీపై వేటు పడింది. 

అయితే టీటీడీ స్థాయిలో మొదటిసారి ఇలాంటి వ్యవహారం బహిర్గతమైంది. దీనిపై ప్రాథమిక సమాచారంతో నిర్ధారణకు వచ్చి పృథ్వీపై వేటు వేసినా లోతైన దర్యాప్తు జరిగిందా? అసలు జరుగుతుందా? అనేది అనుమానమే. ఎందుకంటే ఈ వివాదం జరిగి రోజులు గడుస్తున్నా విజిలెన్స్‌ నివేదిక ఇవ్వకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయట. SVBC మాజీ చైర్మన్‌ పృథ్వీతో ఫోన్‌లో మాట్లాడిన మహిళ ఎవరో ఏమిటో విజిలెన్స్‌ వర్గాలు తెలుసుకున్నాయా లేదా? ఆమె ఇప్పటి వరకూ ఫిర్యాదు చేయకపోవడానికి కారణం ఏమిటి? విజిలెన్స్‌ అధికారులు ఆమెను ఎందుకు ప్రశ్నించలేదు? ఇలా అనేక సందేహాలు ఉన్నాయి.

నిజానికి పృథ్వీ ఆడియో టేపులు బయటకు రాకముందే ఆయనపై విమర్శలు వచ్చాయి. కొన్ని ఆరోపణలను నేరుగా సీఎం జగన్‌ దృష్టికే తీసుకెళ్లారట. ఎస్వీబీసీకి పృథ్వీ చైర్మన్‌గా వచ్చిన ఆరు నెలల కాలంలో చాలా ప్రయాణాలు చేశారట. ఆ టీఏ, డీఏ ఖర్చులను త్వరగా చెల్లించాలని టీటీడీ ఉన్నతాధికారులపై ఒత్తిడి చేశారట. ఇలాంటి సంఘటనలపై విజిలెన్స్‌ ఆరా తీసినట్లు సమాచారం. పృథ్వీ వ్యవహారాశైలి మొదటి నుంచి వివాదస్పదంగానే వుండేది. చానల్ చైర్మన్ పదవిని ప్రూద్వీ రాజ్ హోదా గా భావించడం క్రీయాశిలికంగా వ్యవహరిస్తూ తనకి సంబంధం లేని వ్యవహారాలలో తలదూరుస్తూ వివాదాలుకి ఆజ్యం పోయ్యడం ప్రారంభించారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సందర్భంగా తనే స్వయంగా అన్నమయ్య గేటప్ లు వేయడం రాని తమిళ, కన్నడ భాషల్లో ప్రోమోలు చెయ్యడం భక్తి చానల్ ని హస్య చానల్ గా మార్చేశారు. నిబందనలకు వ్యతిరేకంగా తన అనునూయులు 6 గురిని నియమించడమే కాకూండా రాజకీయ ఒత్తిళ్లతో మరో 30 మందికి స్థానం కల్పించారు పృథ్వీ.

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సందర్భంగా పృథ్వీ రాజ్ చేసిన హడావుడికి టిటిడి మరింత నవ్వులపాలైంది. వాహన ఉరేగింపు సమయంలో టిటిడి పరిపాలనతో ఏ మాత్రం సంభంధం లేని పృథ్వీ రాజ్ మాడవీధులలో నుంచి భక్తులును ఉద్దేశించి ప్రసంగించడం ఆ సమయంలో ఛానల్ లైవ్ కవరేజిలో స్వామి వారి ఉరేగింపు కంటే పృథ్వీ రాజ్ ప్రసంగాన్ని ఎక్కువ గా చూడడంతో టీటీడీ ఉన్నతాధికారులు కుప్పలు తెప్పలుగా భక్తులు నుంచి మెయిల్స్ అందాయి. పృథ్వీ రాజ్ అనవసర ప్రసంగాలు ను తిట్టిపోస్తూ వున్న మెయిల్సే ఎక్కువగా వుండడంతో వాటిని ఛానల్ అధికారులుకు బదాలాయించారు ఉన్నతాధికారులు.

పృథ్వి రాజ్ వ్యవహారం శ్రుతి మించడంతో సరిదిద్దాడానికి సుబ్బారెడ్డి రంగంలోకి దిగవలసివచ్చింది. అన్నమయ్య వేషధారణ కోసం పృథ్వి ఏకంగా 7 లక్షల రూపాయలు వ్యయం చేసే వస్ర్తాలును కోనుగోలు చెయ్యడంతో వాటికి ఛానల్ తరపున డబ్బులు చెల్లించేది లేదంటూ చైర్మన్ మండిపడ్డారు. అంతేకాక నిబందనలకు తిలోదకాలు ఇస్తూ నియమించిన 36 మందిని తోలగించమని ఆదేశించారు. ఇంతలోనే పృథ్వి రాజ్ ఆడియో టెప్ వ్యవహారం వెలుగులోకి రావడంతో ఆయన బయటకి వచ్చేశారు. ఇన్ని రోజులైనప్పటకీ నివేదిక బయటకు రాలేదని ఆరా తీస్తే అసలు నివేదిక అనేది ఉందా లేదా? అన్నదీ డౌటేనని అంటున్నారు.  

More Related Stories