English   

పవర్ స్టార్ ఎంట్రీతో.. అశ్వథ్థామ బిగినింగ్

Pawan kalyan
2020-01-29 16:16:07

యంగ్ హీరో నాగశౌర్య 'చలో' సినిమా తర్వాత చేసిన సినిమాలన్నీ ఆశించినంతగా ఫలితాన్నివ్వలేదు. దాంతో రమణ తేజ డైరెక్షన్ లో తెరకెక్కిన 'అశ్వత్థామ' చిత్రంపైనే ఆశలు పెట్టుకున్నాడు నాగశౌర్య. ఈ సినిమా ఈ నెల 31న రిలీజ్ కానుంది. వాస్తవానికి ఈ సినిమాతో సంక్రాతికే సందడి చేయాలనుకున్నా.. బన్నీ, మహేష్ వంటి స్టార్ హీరోల సినిమాలు ఉండడంతో వెనక్కి తగ్గాడు శౌర్య. అయితే అప్పటి నుంచి ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నాడు.

అందులోభాగంగా ఈ సినిమా గురించి రీసెంట్ గా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు ఈ యంగ్ స్టర్. అశ్వథ్థామ మూవీ స్టార్టింగ్ లోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ తో స్టార్ట్ అవుతుందని చెప్పుకొచ్చాడు. అయితే పవన్ నిజంగానే ఈ సినిమాకు వాయిస్ ఇచ్చాడా..? అనుకుంటే పప్పులో కాలేసినట్టే.

అసలు విషయంలోకి వెళ్తే.. మా సినిమా బిగినింగ్ లో 'గోపాల గోపాల' సినిమాలో నుంచి పవన్ కళ్యాణ్ చెప్పిన ఒక డైలాగ్ క్లిప్ వాడుకున్నామని.. పవన్ చెప్పిన డైలాగ్ తోనే అశ్వథ్థామ టైటిల్ కు క్లారిఫికేషన్ ఇస్తుందని.. దాంతో సినిమా పై మరింత ఆసక్తి నెలకొనేలా ఉంటుందని అన్నాడు శౌర్య. ఇలా పవర్ స్టార్ పేరు చెప్పి ఈ సినిమాకు ఫుల్ హైప్ తీసుకొచ్చాడు ఈ లవర్ బాయ్. మరి ఈ సినిమా నాగశౌర్యకు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి. 

More Related Stories