English   

మరోసారి గీత గోవిందం కాంబినేషన్.. సీక్వెలా

Vijay Deverakonda
2020-01-29 16:43:49

యంగ్ హీరో విజయ్ దేవరకొండ యూత్ ఐకాన్ గా దూసుకుపోతున్నాడు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం.. ఇలా వరుస సినిమాలతో తనకంటూ ఒక స్టార్ డమ్ సంపాదించుకున్నాడు విజయ్. ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కిన వరల్డ్ ఫేమస్ లవర్ ఫిబ్రవరి 14న విడుదల కానుంది. అలాగే పూరి జగన్నాథ్ డైరెక్షన్లో 'ఫైటర్' అనే సినిమా సెట్స్ పై ఉంది. ఈ సినిమా తర్వాత ఈ యంగ్ స్టర్ మరో సినిమాను లైన్లో పెట్టినట్టు సమాచారం.

పరశురాం దర్శకత్వంలో వచ్చిన గీత గోవిందం.. విజయ్ కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ గా నిలిచిపోయింది. ఇప్పుడు పరశురాంతో కలిసి విజయ్ మరో సినిమా చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే పరశురాం, విజయ్ కు ఒక మంచి స్టోరీ లైన్ వినిపించాడట. అది బాగా నచ్చడంతో.. దానిని పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ డెవలప్ మెంట్ చేయమన్నాడట విజయ్. పరశురామ్ త్వరలోనే నాగ చైతన్య తో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా అయిపోగానే విజయ్ సినిమా చేయనున్నాడని టాక్.

ఈలోపు సెట్స్ పై ఉన్న విజయ్ ప్రాజెక్ట్స్ కూడా కంప్లీట్ అవుతాయి. ఆ తర్వాత గీత గోవిందం కాంబోలో మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. అయితే మరో ప్రచారం ఏంటంటే.. ఈ సినిమా గీత గోవిందం కు సీక్వెల్ కూడా అయి ఉండొచ్చని అంటున్నారు. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు తెలియాలంటే.. ఇంకొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.

More Related Stories