English   

జాను ట్రైలర్ రివ్యూ.. శర్వానంద్, సమంత పొయెటిక్ లవ్ స్టోరీ..

 Jaanu Trailer Talk
2020-01-29 17:21:02

96.. తెలుగులో ఈ మ‌ధ్య ఎక్కువ‌గా వినిపించిన పేరు. తమిళంలో సంచ‌ల‌న విజ‌యం సాధించిన సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు దిల్ రాజు. అక్కడ  విజ‌య్ సేతుప‌తి, త్రిష న‌టించిన ఈ చిత్రాన్ని ప్రేమ్ కుమార్ తెర‌కెక్కించాడు. విడుద‌లైన నాటి నుంచి నేటి వ‌ర‌కు ఈ చిత్రం గురించి టాపిక్స్ న‌డుస్తూనే ఉన్నాయి. తెలుగులో కూడా ఈయనే తెరకెక్కించాడు. ఎలాంటి సందడి లేకుండా షూటింగ్ పూర్తి చేసుకుంది జాను. 

ఈ చిత్ర ట్రైలర్ విడుదలైందిప్పుడు. ఇది చూసిన తర్వాత సినిమా ఎలా ఉండబోతుందో క్లారిటీ వచ్చేసింది. తమిళ్ సినిమాను ఏ మాత్రం మార్చకుండా ఉన్నదున్నట్లు తెలుగులో రీమేక్ చేసాడు ప్రేమ్ కుమార్. శర్వానంద్, సమంత కూడా పూర్తిగా విజయ్, త్రిష పాత్రలను ఓన్ చేసుకున్నారు. సొంత స్టైల్ కూడా కనిపిస్తున్నా.. ఒరిజినల్ చూసిన వాళ్లకు జాను కొత్తగా అనిపించదు. పైగా పొయెటిక్ టచ్ కూడా మరీ ఎక్కువగా అనిపిస్తుంది. ఈ చిత్రం తెలుగులో ఎంతవరకు ఆట్టుకుంటుందనేది పక్కనబెడితే కచ్చితంగా హృదయాన్ని తాకే మంచి సినిమా అవుతుందనేది మాత్రం అర్థమైపోతుంది. ట్రైలర్ లో విజువల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఫిబ్రవరి 7న జాను విడుదల కానుంది.

More Related Stories