English   

అశ్వథ్థామ ఎలా ఉండబోతుందంటే.. నాగశౌర్య హిట్ కొడతాడా..

 Naga Shaurya
2020-01-29 17:58:15

ఛలో లాంటి సినిమా తర్వాత ఇప్పటి వరకు మళ్లీ హిట్ కొట్టలేకపోయాడు నాగశౌర్య. ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలన్నీ ఫట్ అనిపించాయి. మంచి అంచనాలతో వచ్చిన నర్తనశాల సినిమా కూడా దారుణంగా ఫ్లాప్ అయింది. ఓ బేబీ సినిమాతో హిట్ కొట్టినా కూడా అది సమంత ఖాతాలోకి వెళ్లిపోయింది. దాంతో ఇప్పుడు ఈయనకు సోలోగా హిట్ అవసరం. ఇలాంటి సమయంలో అశ్వథామ కథను సొంతంగా తనే రాసుకుని వస్తున్నాడు నాగశౌర్య. 

ఇప్పటి వరకు ఈయన్ని కేవలం లవర్ బాయ్ పాత్రల్లోనే చూసారు ఆడియన్స్. కానీ ఈయన మాత్రం తొలిసారి పూర్తిగా మాస్ అవతారంలోకి మారిపోయాడు. కథ తానే రాసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించే బాధ్యత మాత్రం కొత్త దర్శకుడు రమణ తేజ చేతుల్లో పెట్టాడు శౌర్య. ఈ సినిమా సెన్సార్ రిపోర్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. అయితే సినిమా అంతా రాక్షసుడు లైన్ లోనే ఉంటుందని తెలుస్తుంది. అమ్మాయిలను కిడ్నాప్ చేసి చంపేయడం.. వాళ్లను పట్టుకోడానికి హీరో చేసే ప్రయత్నమే సినిమా అంతా సాగుతుందని ప్రచారం జరుగుతుంది. 

ఇదే లైన్ తోనే రాక్షసుడు సినిమా కూడా వచ్చింది. సెన్సార్ టాక్ కూడా పాజిటివ్ గానే రావడంతో నాగశౌర్య అండ్ టీం సినిమాపై కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. కచ్చితంగా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నారు వాళ్లు. పైగా అశ్వథ్థామ భారంతో చెడ్డవాడని.. కానీ అతనిలోని మంచిని మాత్రమే తీసుకున్నామని చెబుతున్నాడు శౌర్య. ఈ కాన్సెప్ట్ ప్రేక్షకులకు ఎంతవరకు నచ్చుతుందో చూడాలిక. 

More Related Stories