English   

చిరు కొరటాల సినిమాలో చరణ్ అంతసేపు కనిపిస్తాడా..

 Ram charan
2020-01-29 18:40:44

తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'సైరా నరసింహారెడ్డి' తర్వాత మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నసంగతి తెలిసిందే. భరత్ అనే నేను.. సినిమా తర్వాత కొరటాల, మెగాస్టార్ కోసం చాలా కాలమే ఎదురు చూశాడు. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ పై ఉంది. కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన సందేశాత్మక చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ చరణ్ కూడా నటిస్తున్నాడని సినిమా మొదలైనప్పటి నుంచి వినిపిస్తోంది.

తాజాగా ఈ సినిమాలో చెర్రీ రోల్, టైమింగ్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. చరణ్ ఎలాంటి పాత్ర చేస్తున్నాడన్నది పక్కన పెడితే.. ఈ క్రేజీ మూవీలో చరణ్ క్యారెక్టర్ చాలా ముఖ్యమైందని అంటున్నారు. ఇందులో దాదాపుగా 20 నిమిషాల పాటు చరణ్, చిరుతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకొనున్నాడని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమా కోసం చెర్రీ 30 రోజులు కాల్షీట్లు కూడా ఇచ్చినట్టు సమాచారం. 

అయితే నిజనిజాలు ఏంటనేది.. సినిమా రిలీజ్ అయ్యాక లేకపోతే చిత్ర యూనిట్ ప్రకటిస్తేగానీ తెలియదు. ఇకపోతే 90 రోజుల్లో ఈ సినిమాను పూర్తి చేసే పనిలో చాలా బిజీగా ఉన్నారు చిత్ర యూనిట్. ఇక హీరోయిన్ గా త్రిష నటిస్తోంది. మరో హీరోయిన్ గా స్వీటీ అనుష్క పేరు వినిపిస్తోంది. అలాగే 'గోవిందాచార్య', 'గోవిందా హరి గోవిందా' అనే టైటిల్స్ వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

More Related Stories