English   

పవన్ కళ్యాణ్, క్రిష్ సినిమా సత్యాగ్రహి కథా.. 

Pawan Kalyan
2020-01-29 19:29:28

దాదాపు 12 ఏళ్ల కింద పవన్ కళ్యాణ్ సత్యాగ్రహి పేరుతో ఒక సినిమా చేయాలనుకున్నాడు. జానీ సినిమా డిజాస్టర్ అయిన తర్వాత మళ్లీ దర్శకత్వం వైపు ఆలోచించని పవర్ స్టార్.. AM రత్నం నిర్మాతగా సత్యాగ్రహి సినిమా అనౌన్స్ చేశాడు. ఓపెనింగ్ కార్యక్రమం కూడా ఘనంగా జరిగింది. సోషల్ మెసేజ్ ఉన్న కథతో ఈ సినిమాను తెరకెక్కించాలనుకున్నాడు పవన్ కళ్యాణ్. కాకపోతే అనుకోని కారణాలతో సత్యాగ్రహి అప్పుడే ఆగిపోయింది. 

ఆ తర్వాత పవన్ ఇతర సినిమాలతో బిజీ అవ్వడం.. ఇప్పుడు రాజకీయాల్లోకి రావడంతో సత్యాగ్రహి అలాగే అటకెక్కింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఈ సినిమాకు కథకు రెక్కలు వచ్చినట్లు తెలుస్తోంది. తాను చేయాలనుకున్న ఈ సినిమాను దర్శకుడు క్రిష్ చేతుల్లో పవన్ కళ్యాణ్ పెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈయన పింక్ సినిమా రీమేక్ మొదలు పెట్టాడు. ఈ చిత్ర షూటింగ్ జరుగుతుంది. ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ కాస్త గ్యాప్ తీసుకొని సినిమాలు చేయాలని ఆలోచిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. 

క్రిష్ చేయబోయే సినిమా సత్యాగ్రహ కాదా అనేది ఎవరు క్లారిటీ ఇవ్వలేదు.. కానీ ఈ సినిమాకు లైన్ మాత్రం పవన్ కళ్యాణ్ చెబుతున్నాడని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి చేసే సినిమా కూడా అలాగే ఉండాలని అభిమానులు కోరుకుంటారు. దానికి తగ్గట్లుగానే పవన్ కళ్యాణ్ ఒక బాధ్యతాయుతమైన పాత్రలో నటించబోతున్నాడని తెలుస్తోంది. దాంతోపాటే ఈ సినిమాలో పవన్ బందిపోటు పాత్రలో నటిస్తున్నాడని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా కూడా క్రిష్ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలిక. 

More Related Stories