English   

నందమూరి కుటుంబానికి ఎన్టీఆర్ ఒక్కడే దిక్కా...

NTR.jpg
2020-01-30 06:34:14

తెలుగు ఇండస్ట్రీలో నందమూరి కుటుంబం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అప్పట్లో అన్నగారు సృష్టించిన సంచలనాల గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. తమకంటూ ప్రత్యేకంగా కొన్ని పేజీలు లిఖించుకున్నారు నందమూరి హీరోలు. అయితే సక్సెస్ రేట్ మాత్రం ఆ స్థాయిలో లేదు. సీనియర్ ఎన్టీఆర్ కు నట వారసుడిగా రంగప్రవేశం చేసిన బాలకృష్ణ అప్పట్లో సంచలనాలు సృష్టించాడు. నాన్న పేరు నిలబెడుతూ రికార్డులు తిరగరాసాడు. తెలుగులో బాలయ్యకు తిరుగులేని మాస్ ఇమేజ్ కూడా ఉంది.

అయితే ఇది అప్పుడు ఇప్పుడు కాదు. అప్పట్లో కొత్త సినిమా వస్తే కలెక్షన్ల రికార్డులు తిరగరాసిన బాలయ్య ఇప్పుడు కనిపించడం లేదు. ఆ స్థాయిలో ఇప్పుడు ఈయన సినిమాలు వసూళ్లు కూడా తీసుకురావడం లేదు. కనీస వసూళ్లు కూడా తీసుకురాలేక చేతులెత్తేస్తున్నాయి. కథానాయకుడు, మహానాయకుడు, రూలర్ సినిమాలతో హ్యాట్రిక్ డిజాస్టర్స్ అందుకున్నాడు బాలయ్య. ఇలాంటి సమయంలో బోయపాటి సినిమాపైనే బాలయ్య కెరీర్ ఆశలన్నీ ఉన్నాయి. ఇక ఈయన తర్వాత నందమూరి కుటుంబం నుంచి తారకరత్న, కళ్యాణ్ రామ్ లాంటి హీరోలు వచ్చారు. అయితే వాళ్ళంతా సక్సెస్ కాలేదు. కళ్యాన్ రామ్ పర్లేదు కానీ తారకరత్న అయితే కనీసం కనిపించడం లేదు. అయితే నందమూరి కుటుంబంలో ఎంతమంది హీరోలున్నా కూడా ఒక్కరు మాత్రమే ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ లెగసీని ముందుకు తీసుకెళ్తున్నాడు.

అతడే జూనియర్ ఎన్టీఆర్. కొన్నేళ్లుగా వరస విజయాలు అందుకుంటూ పెద్దాయన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు జూనియర్. ముఖ్యంగా ఈయన ఎంచుకుంటున్న కథలు కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు నందమూరి చిన్నోడు. నందమూరి హీరోల్లో 100 కోట్ల మార్కెట్ ఉన్న ఏకైక హీరో ఈయనే. వరస విజయాలతో పాటు మార్కెట్ పరంగా కూడా కొత్త చరిత్రకు నాందీ పలుకుతున్నాడు ఎన్టీఆర్.

బోయపాటి సినిమా బ్లాక్ బస్టర్ అయినా కూడా బాలయ్య మార్కెట్ మాత్రం పెద్దగా మారే అవకాశం కనిపించడం లేదు. ఈయన ఇప్పుడు ఎన్ని విజయాలు అందుకున్నా కూడా మునపటి మార్కెట్ అయితే రాదు. దాంతో నందమూరి కుటుంబానికి ఒక్కడే దిక్కయ్యేలా కనిపిస్తున్నాడు.

More Related Stories