English   

పవన్ సినిమా కోసం చార్మినార్, తాజ్ మహల్ సెట్స్...

Pawan Kalyan.jpg
2020-01-30 07:44:01

ఉన్నట్లుండి పవన్ కళ్యాణ్ రెండు సినిమాలతో బిజీ అయ్యాడు. ఈ రహస్యమేంటో తెలియక జుట్టు పీక్కుంటున్నారు అభిమానులు. అయితే ఇప్పుడు క్రిష్ సినిమా మాత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతుందని తెలుస్తుంది. ఏఎం రత్నం ఈ సినిమా కోసం ఏకంగా 100 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నాడని తెలుస్తుంది. శాతకర్ణి, మణికర్ణిక లాంటి భారీ సినిమాలను తెరకెక్కించిన అనుభవం ఉండటంతో క్రిష్ ను ఈ సినిమాకు తీసుకున్నారు.

ఇదిలా ఉంటే స్వాతంత్య్రానికి పూర్వం కథతో పవన్ సినిమా వస్తుందని ప్రచారం జరుగుతుంది. నానక్ రామ్ గూడలో క్రిష్ సినిమా మొదలు పెట్టాడు పవన్. తొలి షెడ్యూల్ ఫిబ్రవరి 4 నుంచి మొదలు కానుంది. అయితే పవన్ మాత్రం రావట్లేదు. పింక్ సినిమా రీమేక్ అయిపోయిన తర్వాతే పవన్ వచ్చి ఈ షూటింగ్ లో పాల్గొంటాడని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా ఛార్మినార్, తాజ్ మహల్ సెట్స్ నిర్మిస్తున్నారు. అల్యూమినియం ఫ్యాక్టరీలోనే ఈ భారీ సెట్స్ నిర్మాణం జరుగుతుంది. అక్కడే మేజర్ పార్ట్ షూటింగ్ జరగనుంది. ఇందులో బందిపోటుగా పవన్ కనిపిస్తాడని తెలుస్తుంది. కేవలం సెట్స్ కోసమే 25 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు నిర్మాతలు.

ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత మరో సినిమా ఏదీ చేయని క్రిష్ ఇప్పుడు పవన్ కోసం కథ సిద్ధం చేస్తున్నాడు. ఈ సినిమా కథ బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేసాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ముందు నుంచి అనుకుంటున్నట్లుగానే ఈ చిత్రాన్ని AM రత్నం నిర్మిస్తున్నాడు. చాలా రోజుల కిందే ఈయన సినిమాకు కమిట్మెంట్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. అప్పట్లో నీసన్ సినిమాను కూడా మొదలుపెట్టి ఆపేసాడు. అయితే అప్పుడు ఇచ్చిన మాటను ఇప్పుడు పూర్తి చేస్తున్నాడు పవర్ స్టార్. యాక్షన్ సబ్జెక్టుగా ఇది ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు పవర్ స్టార్. దీనికోసం కూడా తక్కువ రోజులే కాల్షీట్స్ ఇచ్చాడు.

మొత్తానికి ఇన్ని రోజులు సినిమాలు చేస్తాడా చేయడా అనే కన్ఫ్యూజన్ నుంచి ఒకేసారి రెండు సినిమాలు చేస్తున్నాడు పవర్ స్టార్. మే లో పింక్ సినిమా విడుదల కానుంటే.. ఇది వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.

More Related Stories