పాపం రవితేజ హీరోయిన్ అందం అడవి కాచిన వెన్నెలేనా..

ఏమో ఇప్పుడు మాళవిక శర్మను ఇదే అడగాలనిపిస్తుంది మరి. పాపం అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు ఈ పాపకు అదృష్టం కలిసి రావడం లేదు. అందం ఉంది.. అందాన్ని ఆరబోయడానికి కావాల్సినంత అనుకువ కూడా ఉంది. కానీ విజయం రాలేదని చిన్నచూపు చూస్తున్నారు. నేల టికెట్ లో అందాలన్నీ ఆరబోసినా కూడా ఆ సినిమా డిజాస్టర్ అయ్యేసరికి ఏం చేయాలో తెలియక తిక్క చూపులు చూస్తుంది ఈ ముద్దుగుమ్మ. పట్టుమని పాతికేళ్లు కూడా లేని మాళవిక వచ్చీ రావడంతోనే అందాలన్నీ చూపించేసింది. దాంతో ఇక చూపించడానికి కూడా ఏమీ లేవు. ఈ లేలేత ప్రాయాల సుందరి వైపు మన దర్శక నిర్మాతలు కూడా చూడటం లేదు. నేలటికెట్ విడుదలకు ముందు మాళవికను చూసి అంతా ఫిదా అయిపోయారు. అమ్మాయి అందాల ఆరబోతలో పిహెచ్ డీ పూర్తి చేసింది.
సినిమాలో నటన కూడా అదే రేంజ్ లో చేస్తే మాత్రం ఇక్కడే సెటిల్ అయిపోతుందేమో అనుకున్నారు. కానీ అది అంతా ఈజీ కాదని అర్థమైపోయింది. దానికి కారణం అమ్మాయికి అందాలపై ఉన్న శ్రద్ధ.. అభినయంపై లేదని అర్థమైపోయింది. నేలటికెట్ లో అసలు మాళవిక కారెక్టర్ కు పెద్దగా స్కోప్ లేదు. పాటలకు అలా వచ్చెళ్లడం తప్ప. దానికి తోడు సినిమా డిజాస్టర్ కావడంతో పూర్తిగా మాయమైపోయింది. ఇన్నాళ్లకు ఈమెకు రామ్ ఛాన్స్ ఇచ్చాడు. రెడ్ సినిమాలో ఈమె కూడా ఓ హీరోయిన్ గా నటిస్తుంది. దాంతో ఇప్పుడు మళ్లీ కలర్ కలర్ డ్రస్సుల్లో కలవరం పుట్టిస్తుంది ఈ ముద్దుగుమ్మ. మాళవికను అలా చూస్తుంటే బాబోయ్ ఈ భామనా మనం కాదంటున్నది అంటూ దర్శకులు కూడా ఫీల్ అవుతారేమో..? మరి ఇదే అందాల ఆరబోతతో నేలటికెట్ పిల్ల ఎంతవరకు లాక్కొస్తుందో చూడాలిక..!