English   

టక్ జగదీష్ షూటింగ్ షురూ.. తెలుగమ్మాయిలతో రొమాన్స్.. 

Tuck Jagadish
2020-01-30 11:54:04

గ్యాంగ్ లీడర్ ఫ్లాప్ తర్వాత కూడా జోరు తగ్గించడం లేదు నాని. ప్రస్తుతం వి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ చివరిదశకు వచ్చేసరికి ఇప్పుడు మరో సినిమాతో సిద్ధమవుతున్నాడు. వరస సినిమాలతో రఫ్ ఆడిస్తున్నాడు నాని. ఒక సినిమా పూర్తి కాకముందే మరో రెండు మూడు సినిమాలకు కమిట్మెంట్ ఇచ్చేస్తున్నాడు ఈయన. 

గతేడాది జెర్సీ, గ్యాంగ్ లీడర్ సినిమాలతో వచ్చాడు నాని. ఇందులో జెర్సీ మంచి విజయం తో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. గ్యాంగ్ లీడర్ మాత్రం డిజాస్టర్ అయిపోయింది. ప్రస్తుతం ఇంద్రగంటి మోహన కృష్ణ తెరకెక్కిస్తున్న వి సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు నాని. ఇది ఈయనకు 25వ సినిమా కావడం విశేషం. సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కూడా అదిరిపోయింది. ఇప్పటికే వి చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో తన 26వ సినిమాపై దృష్టి పెట్టాడు నాని. ఈ సినిమాను శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నాడు. మూడేళ్ల కింద నిన్ను కోరి అంటూ ఈ కాంబినేషన్ మాయ చేసింది. ఇప్పుడు మరోసారి అదే కాంబినేషన్లో టక్ జగదీష్ సినిమా వస్తుంది.

తాజాగా ఈ సినిమా ఓపెనింగ్ జరిగింది. దీనికి కొరటాల శివ, దిల్ రాజు లాంటి వాళ్లు వచ్చారు. దిల్ రాజు క్లాప్ కొట్టగా.. కొరటాల తొలి షాట్ కు దర్శకత్వం వహించాడు. నిన్నుకోరి, మజిలీ లాంటి సూపర్ హిట్ సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్నాడు శివ నిర్వాణ. దాంతో ఇప్పుడు నాని సినిమా హ్యాట్రిక్ పూర్తి చేయాలని చూస్తున్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. సన్ షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గురపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2020లో టక్ జగదీష్ ప్రేక్షకుల ముందుకు రానుంది. శివ నిర్వాణ తొలిసారి మాస్ స్టోరీ ప్రయత్నిస్తున్నాడు.

More Related Stories