English   

అబ్బా.. పొద్దుపొద్దున్నే వేధిస్తున్నారంటున్న కళ్యాణి.. 

 Karate Kalyani
2020-01-30 12:52:55

తెలుగు ఇండస్ట్రీలో కరాటే కళ్యాణి గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. అయితే ఆమె పేరుతో పరిచయం లేకపోయినా కూడా ఆమె చేసిన సినిమాలతో మాత్రం బాగానే పరిచయం. కృష్ణ సినిమాలో బ్రహ్మిని బాబీ అంటూ ప్రేమగా పిలిచే కారెక్టర్ గుర్తుండే ఉంటుంది కదా.. ఆ తర్వాత మిరపకాయ్ సినిమాలో అబ్బా అంటూ రవితేజతో మరోసారి మ్యాజిక్ చేసిన నటి కళ్యాణి గుర్తుంది కదా. 

ఆమెకు ఇప్పుడు పొద్దున్నే లేవగానే అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు.. అశ్లీల వీడియోలు వస్తున్నాయంటూ సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ ను ఆశ్రయించింది. ఉదయాన్నే తనను చిత్రహింసలు పెడుతున్నారంటూ ఆమె వాపోతుంది. పొద్దున్నే లేచి ఫోన్ చూసుకోవాలంటే కూడా భయమేస్తుందని చెబుతుంది ఈమె. కొన్ని రోజులుగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తనను కావాలనే టార్గెట్ చేస్తున్నారని.. ఇలాంటి చిల్లర పనులు చేస్తున్నారని చెబుతుంది కళ్యాణి. 

తను కొన్ని నెంబర్స్ బ్లాక్‌ చేసినా కూడా ఇతర పోన్ నెంబర్స్ తో వీడియోలు పంపుతున్నారని.. అవన్నీ చాలా అశ్లీలంగా ఉన్నాయని ఆమె వివరించింది. తన వ్యక్తిగత జీవితానికి భంగం కలిగేలా ప్రవరిస్తున్నారని.. కొన్నింటిలో తన ఫొటోలను మార్ఫింగ్‌ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తున్నారంటూ తెలిపింది కరాటే కళ్యాణి. వీరిపై చర్యలు తీసుకోవాలని పోలీస్‌ అధికారులను అభ్యర్థించింది. 

అయితే దీనివెనక కూడా కొన్ని కారణాలున్నాయి. కొన్ని రోజుల కింద సోషల్ మీడియాలో ఈమె పోస్ట్ చేసిన వీడియో ఒకటి వైరల్ అయింది. క్రైస్తవ సంఘాల ప్రతినిధుల పేరుతో కొన్ని రోజుల నుంచి హిందువుల మనోభావాలను రెచ్చగొట్టే విధంగా యూ ట్యూబ్‌, ఫేస్‌బుక్‌లలో వీడియోలను అప్‌లోడ్‌ చేస్తున్నారని.. దానిపై రియాక్ట్ అయినందుకే తనను ఇలా టార్గెట్ చేసారని కరాటే కళ్యాణి పోలీసులకు వివరించారు. 

More Related Stories