English   

తాగాలి.. తాగి తెగ తూగాలి అంటున్న శృతి హాసన్.. 

Shruti Haasan
2020-01-30 13:56:51

కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న శృతి హాసన్.. ఇప్పుడు మళ్లీ కెరీర్ పై ఫోకస్ చేసింది. ప్రస్తుతం ఈమె వరస సినిమాలు చేస్తుంది. తెలుగులో రవితేజతో క్రాక్ సినిమా ఒప్పుకుంది. ఈయనతో గతంలోనే బలుపు సినిమాలో నటించింది శృతి హాసన్. ఇప్పుడు మరోసారి సేమ్ కాంబినేషన్ లో సినిమా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. 

ఈమె కేవలం నటి మాత్రమే కాదు.. మల్టీటాలెంటెడ్ కూడా. నటిగానే కాకుండా సింగర్‌గా.. మ్యూజీషియన్‌గా చాలా జాబ్స్ చేస్తుంది శృతి హాసన్. సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకుని ఈ మధ్యే తన పుట్టినరోజు వేడుకలను లండన్‌లో ఘనంగా జరుపుకుంది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది శృతి హాసన్. అందులో అమ్మడు ఫుల్లుగా తాగేసి రోడ్డుపై డాన్సులు చేస్తుంది. తన స్నేహితులతో కలిసి ఎంతో ఆనందంగా తన పుట్టినరోజును ఘనంగా జరుపుకున్న శృతి.. అక్కడే లండన్ వీధుల్లో చిందేసి తనను ఆదరించినందుకు.. ఇంతగా ప్రేమిస్తున్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపింది. 

ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో భాగంగా తనకు తాగే అలవాటున్నట్లు ఓపెన్ గానే ఒప్పుకుంది శృతి. అది గుర్తుంది కాబట్టే శృతి హాసన్ లండన్ వీధుల్లో కూడా తాగి తూగిందంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. లేకపోతే అలా రోడ్డు మీద డాన్సులేంటి బేబీ అంటూ నెటిజన్లు కామెంట్స్ కూడా పెడుతున్నారు. శృతి హాసన్ పోస్ట్ చేసిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయ్యో అందులో శృతి హాసన్ తాగలేదని చెప్పేవాళ్లు కూడా కొందరున్నారు.. కానీ అక్కడ చూస్తుంటే మాత్రం అమ్మడు ఫుల్లుగా తాగేసినట్లుంది కదా అంటూ మరికొందరు వాదిస్తున్నారు. 

More Related Stories