English   

నాకు నా కుటుంబమే బలం అంటున్న మహేష్ బాబు..

Mahesh Babu
2020-01-30 17:24:31

ఒకప్పుడు హీరోలు ఏడాదికి అరడజను సినిమాలు చేసే వాళ్ళు.. ఇండస్ట్రీ కోసమో లేదంటే వాళ్ల కోస‌మో తెలియదు కానీ అలా న‌టించేవాళ్లు. కానీ ఈ త‌రం హీరోల‌కు మాత్రం అంత సినిమా లేదు. ఇప్పటి హీరోలు ముందు కుటుంబం.. ఆ త‌ర్వాత సినిమా అంటున్నారు. అందుకే ఏడాదికి ఒక్క సినిమా కంటే ఎక్కువ చేయలేకపోతున్నారు మన హీరోలు. వాళ్లు ఏ మాత్రం సమయం దొరికినా కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లిపోతున్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మహేష్ బాబు గురించే. 

ఈయనకు ఏ మాత్రం సమయం దొరికినా కూడా వెంటనే తన పిల్లలతో కలిసి ఫారిన్ ట్రిప్పులు వెళ్లిపోతాడు. ఇప్పుడు కూడా ఇదే చేశాడు మహేష్ బాబు. ఈయన ప్రస్తుతం కూడా హాలీడేలోనే ఉన్నాడు. న్యూ యార్క్, దుబాయ్, చికాగో ట్రిప్స్ తో బిజీగా ఉన్నాడు సూపర్ స్టార్. ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు మహేష్ బాబు. మరో వారం రోజుల్లో ఇండియాకు రానున్నాడు. 

ఇక ఇప్పుడు ఈయన చేసిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతుంది. తన ఇన్నేళ్ల జర్నీని చూస్తుంటే ఆనందంగా ఉందని.. అయితే ఈ ప్రయాణం తన ఒక్కడిది కాదనీ.. ఒక్కడైతే ఇంత దూరం రాలేనని చెప్పాడు సూపర్ స్టార్. తనకు తన కుటుంబమే బలమని చెప్పాడు మహేష్. వాళ్లు లేకపోతే తాను లేనంటూ ఫ్యామిలీ ఫోటో పెట్టాడు సూపర్ స్టార్. ఎప్పుడూ కుటుంబమే ముందు అంటున్నాడు ఈయన. తన కొడుకు కూతురుతో కలిసి ఎప్పుడూ ఎంజాయ్ చేస్తూనే ఉంటాడు మహేష్. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు. ఎప్పుడూ ఇదే చేస్తాడు కూడా.

More Related Stories