English   

చిరంజీవి, హరీష్ శంకర్ సినిమా...

Harish Shankar Chiranjeevi.jpg
2020-01-30 21:54:38

కొందరు దర్శకులు హిట్ సినిమాలు వచ్చినా కూడా వేచి చూడక తప్పని పరిస్థితి. హరీష్ శంకర్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. డిజె సినిమా తర్వాత రెండేళ్లకు పైగా వేచి చూసి గద్దలకొండ గణేష్ సినిమా చేశాడు హరీష్ శంకర్. ఈ సినిమా బాగానే ఆడింది కానీ మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ సినిమా కోసం చాలా తంటాలు పడుతున్నాడు ఈ దర్శకుడు. ఈయన మెగా ఫ్యామిలీకి బాగా దగ్గరగా ఉన్నాడు. బయట హీరోలకు తెలియకుండానే దూరం అయిపోతున్నారు హరీష్ శంకర్. ఇప్పటివరకు ఈయన చేసిన సినిమాల్లో 90% మెగా హీరోలతోనే ఉండటం గమనార్హం.

రవితేజతో షాక్, మిరపకాయ.. జూనియర్ ఎన్టీఆర్ తో రామయ్యా వస్తావయ్యా సినిమాలు మినహాయిస్తే మిగిలిన సినిమాలు అన్ని మెగా కాంపౌండ్ లోనే చేసాడు హరీష్ శంకర్. పైగా హీరోలందరికీ ఈ దర్శకుడు బాగా కలిసి వచ్చాడు. పవన్ కళ్యాణ్ కి గబ్బర్ సింగ్.. సాయి ధరమ్ కు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్.. అల్లు అర్జున్ కు డిజె.. ఈ ఏడాది వరుణ్ తేజ్ కు గద్దలకొండ గణేష్ సినిమాలు ఇచ్చాడు ఈ దర్శకుడు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ కోసం కధ సిద్ధం చేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు చరణ్ సినిమా డైలామాలో పడటంతో మళ్లీ ఆలోచనలో పడిపోయాడు హరీష్. అయితే ఈ మధ్యే చిరంజీవిని కలిసాడు ఈ దర్శకుడు. అక్కడే ఈ ఇద్దరి మధ్య మాటలు కలిసాయని.. మంచి కథతో వస్తే అవకాశం ఇస్తానని చిరు మాటిచ్చినట్లు తెలుస్తుంది. అందుకే ఈ దర్శకుడు కూడా ఇప్పుడు మెగా కథ సిద్ధం చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

పైగా గతంలో సుబ్రమణ్యం ఫర్ సేల్ ఆడియో వేడుకలో కూడా తనకు హరీష్ శంకర్ లాంటి దర్శకులతో పని చేయాలని ఉందని చెప్పాడు చిరు. ఇప్పుడు హరీష్ ఇదే మాట నిజం చేయబోతున్నట్లు తెలుస్తుంది. మరి తమ్ముడికి గబ్బర్ సింగ్ ఇచ్చిన హరీష్.. అన్నయ్యకు ఎలాంటి సినిమా ఇస్తాడో...

More Related Stories