English   

త్రివిక్రమ్ సినిమాలో బాలయ్య...ఎన్టీఆర్ తండ్రిగా నటసింహం...

Balakrishna NTR.jpg
2020-01-31 07:07:07

ఒక్కసారి ఊహించుకోండి.. జస్ట్ ఒక్కసారి ఊహించుకోండి ఆ కాంబినేషన్ ఎలా ఉంటుందో..? ఎన్టీఆర్ సినిమాలో బాలయ్య కానీ నటించాడంటే స్క్రీన్ షేక్ అయిపోవడం ఖాయం. ఇప్పుడు ఇదే ట్రై చేస్తున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈయన తన సినిమాలో బాలయ్యను నటింపచేయాలని చూస్తున్నాడు. ప్రస్తుతం అల వైకుంఠపురములో సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తూనే ఎన్టీఆర్ కోసం కథ సిద్ధం చేస్తున్నాడు మాటల మాంత్రికుడు. ఈ చిత్రానికి అయిననూ పోయిరావలే హస్తినకు అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉంది. ఈ చిత్రం పూర్తిగా కామెడీ ప్రధానంగా సాగుతుందని.. జంధ్యాల తరహా కామెడీ ఇందులో ఉంటుందనే ప్రచారం అయితే జరుగుతుంది. ఇదిలా ఉంటే కామెడీ ఉన్నా కూడా తన మార్క్ యాక్షన్ కూడా ఇందులో ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు త్రివిక్రమ్.

ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ తండ్రిగా బాలయ్యను ఒప్పించాలని చూస్తున్నాడు మాటల మాంత్రికుడు. ఇప్పటికైతే ఆయన్నే అనుకుంటున్నాడు కానీ అది జరుగుతుందా అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఎన్టీఆర్, బాలయ్య కలిసి నటిస్తే కచ్చితంగా అది బ్లాక్ బస్టర్ కాంబనేషన్ కావడం ఖాయమే. కానీ బాలయ్యను ఒప్పించడం మాత్రం చిన్న విషయం కాదు. గతంలో ఎన్టీఆర్ బయోపిక్ లో కళ్యాణ్ రామ్ తో కలిసి నటించాడు బాలయ్య.. ఇప్పుడు జూనియర్ తో కూడా కలిసి నటిస్తే అబ్బాయిలిద్దరితోనూ బాబాయ్ స్క్రీన్ షేర్ చేసుకున్నట్లు అవుతుంది. మరి అది జరుగుతుందో లేదో చూడాలిక.

More Related Stories