కమిట్మెంట్ ఇచ్చి బెడ్డుపై పడుకున్న తెలుగమ్మాయి..

ఏంటి.. తెలుగుమ్మాయి ఏంటి కమిట్మెంట్ ఇవ్వడం ఏంటి.. అందులోనూ అలా పడుకోవడం ఏంటి అనుకుంటున్నారా..? అసలే ఈ మధ్య ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి చాలా వింటున్నాం. తనను అప్పుడు ఆ దర్శకుడు గోకాడని ఓ భామ చెబుతుంటే.. అప్పట్లో తనను ఓ హీరో తాకాడని మరో హీరోయిన్ చెబుతుంది. ఇలాంటి సమయంలో ఓ తెలుగమ్మాయి ఏకంగా కమిట్మెంట్ ఇచ్చి బెడ్డుపై పడుకుంది. నమ్మడానికి కష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం.
ఒక్కసారి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు గుర్తు చేసుకోండి. అందులో తేజస్వి ముదివాడ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత ఐస్ క్రీమ్ లాంటి సినిమాల్లో అందాల ఆరబోతతో మతులు పోగొట్టింది తేజస్వి. హీరోయిన్ గా నిలదొక్కుకోడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది ఈ భామ. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ వెబ్ సిరీస్ లో నటిస్తుంది. కమిట్మెంట్ అంటే అదేదో బూతు కాదు.. అదో వెబ్ సిరీస్ టైటిల్. లక్ష్మీకాంత్ చెన్న దర్శకత్వంలో వస్తున్న ఈ వెబ్ సిరీస్ లో హాట్ హాట్ అందాలు ఆరబోసింది తేజస్వి. ఈ వెబ్ సిరీస్ పోస్టర్ విడుదలైందిప్పుడు.
ఇప్పటికే చాలా సినిమాల్లో చిట్టిపొట్టి బట్టలతో సెగలు పుట్టించింది తేజస్వి. ఇప్పుడు వెబ్ సిరీస్ కోసం మరిన్ని అందాలు ఆరబోస్తుంది ఈ బ్యూటీ. సినిమా సినిమాకి ఇప్పుడు డోస్ పెంచేస్తుంది ఈ భామ. ఆ మధ్య మరాఠీ చిత్రం బాలక్ పాలక్ రీమేక్‌లో నటించాలని కమిటైంది తేజస్వి. తెలుగులో దీనికి బిఎఫ్ అనే టైటిల్ కూడా పెట్టారు. కొత్త దర్శకుడు శ్రీకాంత్ వెలగలేటి తెరకెక్కించాలనుకున్నా కూడా మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు కమిట్మెంట్ వెబ్ సిరీస్ చేస్తుంది. మరి ఇదైనా తేజస్వికి కోరుకున్న గుర్తింపు తీసుకొస్తుందో లేదో చూడాలిక.