English   

టబు పాత్రలో రమ్యకృష్ణ 

Ramya Krishnan
2020-01-31 10:53:17

ప్రస్తుతం రీమేక్స్ యుగం నడుస్తోంది. ఒక భాషలో హిట్ అయిన సినిమాలను మరో బాషలో పెద్దఎత్తున రీమేక్ చేస్తున్నారు. కంటెంట్ ఉంటె అది ఏ బాష సినిమా అని కూడా చూడకుండా తమ తమ బాషలలోకి రీమేక్ చేసుకుంటున్నారు మేకర్స్. శ్రీ రామ్ రాఘవన్ దర్శకత్వంలో టబు, ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే ప్రధాన పాత్రలలో బాలీవుడ్ లో తెరకెక్కిన బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ “అంధాధున్”. 

ఈ సినిమా 2018లో రిలీజయ్యి ఘనవిజయం సాధించింది. 32 కోట్లతో రూపొందిన ఈ మూవీ ఏకంగా 456 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి భారీ రికార్డ్ క్రియేట్ చేసింది. 3 నేషనల్ అవార్డ్స్, 5 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్న ఈ మూవీలో టబు ఒక మంచి పాత్ర లో అద్భుతంగా నటించి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. 

ఇప్పుడు ఈ సినిమా తమిళ భాషలో రీమేక్ కానుంది. నటుడు త్యాగరాజన్ నిర్మిస్తున్న ఈ సినిమాని మోహన్ రాజా దర్శకత్వంలో ప్రశాంత్ హీరోగా తెరకెక్కిస్తున్నారు. అయితే మాతృకలో టబు చేసిన పాత్రలో తమిళ వర్షన్ కి అయితే రమ్యకృష్ణ సరిగ్గా సరిపోతుందని యూనిట్ భావిస్తుందని అంటున్నారు. అయితే యూనిట్ ఆమెను సంప్రదించినట్టు ఆమె గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నట్టు సమాచారం.

More Related Stories