English   

మళ్ళీ డ్యుయల్ రోల్ లో మాస్ మహారాజా 

 Ravi Teja
2020-01-31 11:48:13

హిట్ సినిమా కోసం రవితేజ వేట కొనసాగుతోంది. అప్పుడెప్పుడో అనిల్ రావిపూడి రాజా ది గ్రేట్ తో హిట్ అందుకున్న ఆయన ఆ తర్వాత రెండు మూడు సినిమాలు చేసినా ఉపయోగం లేకుండా పోయింది. మొన్నటికి మొన్న డిస్కోరాజా అనే సినిమా చేసినా అది కూడా ఆయనకు కలిసి రాలేదు. ఇప్పుడు ఆయన మరో సినిమా ఒప్పుకున్నాడు. 

`వీర‌` (2011) త‌రవాత ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ర‌వితేజ మ‌రో సినిమా చేయ‌బోతున్నాడు. హవీష్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద కోనేరు స‌త్య‌నారాయ‌ణ నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ మార్చి నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ కి వెళ్ళ‌నుంది. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో రవితేజ రెండు విభిన్న పార్శ్యాలున్న పాత్ర‌లలో ద‌ర్శ‌న‌మిస్తార‌ట‌. అందులో ఒక పాత్ర‌కి నెగ‌టివ్ షేడ్స్ ఉంటాయ‌ని టాక్. 

త్వరలోనే ఈ విషయం మీద అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి. రవితేజ.. ‘విక్రమార్కుడు’, ‘దరువు’, ‘కిక్‌ 2’, ‘డిస్కోరాజా’ వంటి సినిమాల్లో ద్విపాత్రాభినయం చేశాడు. ఇప్పుడు మళ్లీ ద్విపాత్రాభినయం కావడంతో సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొనగా ఆయన ఫ్యాన్స్ లో మాత్రం టెన్షన్ నెలకొంది.

More Related Stories