English   

అశ్వథ్థామ మూవీ రివ్యూ

Aswathama
2020-01-31 12:48:05

ఛలో వంటి యూత్ ఫుల్ సినిమాతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో నాగశౌర్యకి ఈ సినిమా తర్వాత మంచి హిట్ ఏదీ పడలేదు. ఈ సినిమా తరువాత సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న నాగశౌర్య.. తన లవర్ బాయ్ ఇమేజ్‌ను పక్కనపెట్టి యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్ కథతో ‘అశ్వథ్థామ’గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సొంత బ్యానర్  ఐరా క్రియేషన్స్ లో శౌర్య అమ్మ ఉషా ముల్పూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. మెహ్రీన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఏమేరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.

కథ : 

గణకి పుట్టినప్పటి నుండి చెల్లి అంటే చాలా ఇష్టం. అయితే తన చెల్లెలి నిశితార్థం అంగరంగ వైభవంగా జరుగుతుంది. అయితే ఆ పెళ్లి కాకముందే తనకే తెలియకుండా శౌర్య చెల్లెలు ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. అప్పటికీ అబార్షన్ చేయించినా తన చెల్లెలికి అలా అయ్యేలా చేసింది ఎవరనే మిస్టరీని ఛేదించడం శౌర్య మొదలు పెడతాడు. ఇక అక్కడి నుంచి తను వైజాగ్ లో జరుగుతున్న సేమ్ ఇన్సిడెంట్స్ గురించి తెలుస్తుంది. ఇంతకీ అలా ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? వారిని శౌర్య పట్టుకున్నాడా? లేదా? అనేదే కథ.

విశ్లేషణ :

ఇది కొత్త కథేం కాదు.. కానీ స్క్రీన్ ప్లే మాయ చేస్తే రాక్షసుడులా మాయ చేయొచ్చు. కానీ కమర్షియల్ అంశాల కోసం అశ్వథ్థామున్ని పక్కదారి పట్టించారేమో అనిపించింది. తొలి అరగంట సినిమా హీరో ఇంట్రో.. అతడి ఫైట్స్ కోసమే తీసినట్లుంది. ఇక మాస్ ఇమేజ్ కావాలని నాగశౌర్య యాక్షన్ సన్నివేశాలు చేసినట్లుంది కానీ అవసరం అనిపించలేదు. సినిమా మొదలైన 40 నిమిషాల తర్వాత కానీ అసలు కథ మొదలవ్వదు. ప్రీ ఇంటర్వెల్ నుంచి కథలో వేగం పుంజుకుంది.. ఇంటర్వెల్ నుంచి ఆసక్తికరంగా అనిపిస్తుంది. విలన్ ఎవరో తెలియకుండా సస్పెన్స్ మెయింటేన్ చేయడం ఒక పద్దతి. కానీ ఇక్కడ ఇంటర్వెల్‌కే విలన్‌ను చూపించి క్లైమాక్స్ వరకు కూర్చోబెట్టే ప్రయత్నం చేసాడు దర్శకుడు రమణ తేజ. ఇక్కడే అసలు దెబ్బ పడిందేమో అనిపించింది.. సస్పెన్స్ తొలగిపోవడంతో కథనం నెమ్మదించింది. హీరో ఎలా విలన్‌ను రీచ్ అవుతాడనే ఒక్క చిన్న ఇంట్రెస్ట్ తప్ప.. కథలో కొత్తదనం కనబడలేదు. అమ్మాయిలను ట్రాప్ చేసే సైకోను పట్టుకోడానికి హీరో ఒక్కో అడుగు వేయడం బాగానే ఉంది కానీ విలన్‌ను చేరే చివరి అడుగు మాత్రం చాలా ఈజీగా తేల్చేసాడు దర్శకుడు. అప్పటి వరకు ప్రపంచానికి కనబడని విలన్.. హీరోకు అంత ఈజీగా దొరకడం సిల్లీగా అనిపిస్తుంది. క్లైమాక్స్ మరింత పకడ్బందీగా రాసుకుని ఉంటే బాగుండేది.. అమ్మాయిలను ఎత్తుకెళ్లి చంపేసే ప్రపంచానికి కనబడని సైకో కథలు చాలానే వచ్చాయి. అశ్వథ్థామ కూడా అలాంటి థ్రిల్లరే.. కానీ ఇలాంటి కథలో ఉండాల్సిన సస్పెన్స్ మిస్ అయింది.
 
నటీనటులు : 

నాగ శౌర్య యాక్షన్ హీరోగా బాగా నటించాడు.. ఫైట్స్ బాగున్నాయి. మెహ్రీన్ పాటలకు, కొన్ని సీన్స్‌కు పరిమితం అయిపోయింది. విలన్‌గా నటించిన జిస్సు గుప్తా బాగున్నాడు.. సైకో నటన అదిరిపోయింది.  చరణ్ పాకాల పాటలు జస్ట్ ఓకే మరియు జిబాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని కొన్ని చోట్ల సూపర్బ్ అనిపిస్తే కొన్ని చోట్ల ఎదో ఉందంటే ఉంది అన్నారు.

ఫైనల్ గా : అశ్వథ్థామ మంచి కథే కానీ కథనం వీక్..

రేటింగ్: 2.5/5.

More Related Stories