English   

అందం అనసూయ అయితే అన్నట్లుందే నిను చూస్తే..

Anchor Anasuya
2020-01-31 16:50:59

ఇప్పుడు నిజంగానే అనసూయను చూస్తుంటే ఇదే అనాలనిపిస్తుంది. నిజంగానే తన అందంతో మాయ చేస్తుంది ఈ బుల్లితెర‌ బ్యూటీ. ఇప్పటికే స్మాల్ స్క్రీన్ ను తన అందంతో త‌డిపేసిన బ్యూటీ అన‌సూయ‌. అప్ప‌టి వ‌ర‌కు యాంక‌ర్ అంటే ప‌ద్ద‌తిగా ఉండాలి.. చీర‌క‌ట్టులో క‌నిపించాలనే రూల్స్ కు బ్రేక్ చెప్పింది ఈ బ్యూటీ. పెళ్లి త‌ర్వాత యాంక‌రింగ్ లోకి వ‌చ్చిన అన‌సూయ‌.. మిగిలిన యాంక‌ర్లు అసూయ ప‌డేలా ఎదిగిపోయింది. అన్నింటికీ అందాల‌నే పెట్టుబ‌డిగా పెట్టేసింది. 

అందాల ప్ర‌ద‌ర్శ‌నలో మాత్రం ఇప్ప‌టి హీరోయిన్లు కూడా ప‌నికిరారు. దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవాలి.. వ‌య‌సు ఉండ‌గానే హీరోయిన్ నాలుగు రాళ్లు వేన‌కేసుకోవాలి.. ఆ క్రేజ్ కాస్తా పోయిందంటే చూసేవాళ్లు కూడా ఉండ‌రు. ఇదే ఇప్పుడు అన‌సూయ ఫాలో అవుతోన్న రూట్. ఈ భామ‌కు తెలుసు.. జీవితంలో తాను ఎప్ప‌టికీ స్టార్ హీరోయిన్ అవ్వ‌న‌ని. అందుకే ఇప్పుడున్న క్రేజ్ ను క్యాష్ చేసుకుంటుంది ఈ భామ‌. సింపుల్ గా హీరోయిన్ల‌కు ధీటుగా హాట్ ఫోటోషూట్ల‌తో మ‌త్తెక్కిస్తోంది అను ఆంటీ. 

పెళ్లై ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌ల్లైన త‌ర్వాత కూడా హాట్ షోకు ఏ మాత్రం వెన‌కాడ‌కుండా ఇర‌గ‌దీస్తోంది ఈ ముద్దుగుమ్మ‌. ఆ మ‌ధ్య అన‌సూయ ఓ హాట్ ఫోటోషూట్ చేసింది. వైట్ డ్ర‌స్ లో సింగిల్ క్యాస్ట్యూమ్ తో పిచ్చెక్కించిన అన‌సూయ‌.. ఇప్పుడు మ‌రో ఫోటోషూట్ తో రెచ్చ‌గొట్టింది. ఈ సారి కూడా థండ‌రింగ్ థైస్ చూపిస్తూ మ‌తులు పోగొట్టేసింది. అందాల రాక్ష‌సిలా క‌వ్విస్తుంది ఈ బ్యూటీ. ఇప్పుడు కాక‌పోతే ఇంకెప్పుడు రేంజ్ లో రెచ్చిపోతోంది అన‌సూయ‌. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి.. నేనేంటో చూపిస్తా అనే రేంజ్ లో త‌న హాట్ షోతో ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు హింట్ ఇస్తోంది ఈ బ్యూటీ. 

ఇప్పటికే వరస సినిమాలతో రచ్చ చేస్తుంది అనసూయ. తాజాగా ఇటు టీవీ షోలతో పాటు అటు సినిమాలు కూడా పర్ఫెక్టుగా బ్యాలెన్స్ చేసుకుంటుంది. అల్లు అర్జున్, సుకుమార్ సినిమాతో పాటు చిరంజీవి, కొరటాల సినిమాలోనూ అను నటిస్తుందనే ప్రచారం జరుగుతుంది. మొత్తానికి అన‌సూయ తాను హీరోయిన్ లా ఫిక్సైపోయిందన్న‌మాట‌. మ‌రి ఈ హాట్ అందాల ఆర‌బోత చూస్తుంటే అందానికే అసూయ పుట్టేలా ఉంది క‌దా..!

More Related Stories