English   

ఆర్జీవీ ఒక సైకో బయోపిక్‌ కి...వర్మ నుండి అది కావాలట

rgv
2020-01-31 19:18:11

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఆర్జీవీ అంటే వివాదాలకి బ్రాండ్. హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా ప్రతి సినిమాతో వార్తల్లో నిలిచే వ్యక్తి. ఒకప్పుడు సెన్సేషనల్ సినిమాలు తీసి తెలుగు సినిమా గతీ గమనాన్ని మార్చిన ఆయన ఇప్పుడు సెన్సేషన్ కోసం ఏదో విధంగా ఎవరో ఒకరి పరువు తీయడమే ధ్యేయంగా సినిమాలు తీస్తున్నాడు. కాంట్రవర్షియల్ బయోపిక్స్ తీస్తూ వాటిని కాంట్రావర్సీలతో మార్కెట్ చేసుకుంటూ జొన్నవిత్తులతో కొర్రీ పెట్టుకున్నాడు. సాధారణంగా వర్మ లాంటి వాడి మీద ఎవరూ రాయి వేయడు. కానీ ఆయన ఏకంగా వర్మ బయోపిక్ తీస్తున్నట్టు ప్రకటించారు. ప్రకటించడమే కాదు నిజంగానే తీస్తున్నారు కూడా. దానికి ఆయనే కథ, మాటలు సమకూర్చడమే కాక దర్శకుడు, నిర్మాతగా కూడా మారారు. ఈ సినిమాకి 'ఆర్జీవీ' టైటిల్ కాగ 'ఒక సైకో బయోపిక్' క్యాప్షన్ అనుకున్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్ లో టైటిల్ రిజిస్టర్ చేయించడానికి వెళితే... వర్మ నుండి నోఅబ్జెక్షన్ లెటర్ తీసుకురమ్మని పేర్కొంటూ ఫిలిం చాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ పేరిట ఒక లేఖ విడుదల చేశారు. అయితే వర్మ ఎన్నో వివాదాస్పద టైటిల్‌ పెట్టినా అభ్యంతరం చెప్పని ఛాంబర్‌ నిర్వాహకులు తమ సినిమాకి కండిషన్స్‌ పెట్టడం ఏంటి అని జొన్నవిత్తుల అండ్ కో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

 

More Related Stories